అంతర్జాతీయ ప్రమాణాలతో చమురు నిక్షేపాల వెలికితీత

రాజమండ్రి అసెట్‌ మేనేజర్‌ దేబాసిస్‌ సన్యాల్‌ వెల్లడి
ongc
     అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో   ఓఎన్‌జీసి కేజీబేసిన్‌ పరిధిలో చమురు, ఆయిల్‌ నిక్షేపాలు వెలికి తీస్తున్నామని, ఇందుకోసం అత్యాధునిక  యంత్రాలు, పైప్‌లైన్లు వినియోగిస్తున్నామని ఓఎన్‌జీసీ రాజమండ్రి ఎసెట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ  దేేబాసిస్‌ సన్యాల్‌ చెప్పారు. రాజమహేంద్రవరం  లా హాస్పిన్‌  హోటల్‌లో జూన్ 3న   విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా జిఎం శ్రీ ఆకొండి  కామరాజు పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా ఓఎన్‌జిసి కార్యకలాపాలను వివరించారు. హెచ్‌ఆర్‌ జిఎం రాజీవ్‌కె శర్మ, సర్ఫేస్‌ మేనేజర్‌ సతీష్‌కుమార్‌,  ఉద్యోగుల సంఘం ప్రతినిధి శ్రీ డివి. కృష్ణంరాజు  పాల్గొన్నారు. అనంతరం ఈడీ శ్రీ   సన్యాల్‌ మాట్లాడుతూ కేజీ బేసిన్‌లో చమురు, సహజవాయువుల ఉత్పత్తి మరింతగా పెంచేందుకు లక్ష్యాలు నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఓఎన్‌జిసి కేజీ బేసిన్‌ ప్రగతిపధంలో  పయనిస్తుందని,  కేజీ బేసిన్‌లో రోజుకు 2.5ఎంఎంసిఎం గ్యాస్‌, 900 మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ నిక్షేపాలను వెలికి తీస్తున్నామన్నారు. చములు, సహజవాయువు నిక్షేమపాలతో ఇతర ఇంధనాలను కూలా వెలికితీస్తున్నామన్నారు. భూమిపైనే కాకుండా సముద్రంలో కూడా చమురు, సహజవాయువలను అన్వేషించి వెలికితీయడం జరుగుతుందన్నారు.  సముద్రంలో చమురు, సహజవాయువుల ఉత్పత్తికి రూ.200కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, అదే భూమిపై అయితే రూ.50కోట్లు ఖర్చుచేస్తే సరిపోతుందన్నారు.  చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికితీసిన బావుల్లోనుంచి కూడా కొత్త విధానంతో మరింత ఉత్పత్తిని వెలికితీస్తున్నామన్నారు. విరివిగా నూతన అన్వేషణలు జరుపుతున్నామన్నారు. కెజీ బేసిన్‌లో నాగాయిలంకలో కొత్తగా చమురు ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కృష్ణపల్లి డీప్‌, కేశనపల్లి బావిల నుంచి ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ (సిఎస్‌ఆర్‌) కింద లాభంలో రెండు శాతం ఖర్చుచేస్తున్నామని చెబుతూ, ఇందులో భాగంగా  గత ఏడాది రూ.14కోట్లు ఖర్చుచేశామన్నారు. సిఎస్‌ఆర్‌ నిధులు ఖర్చుచేయడంలో తూర్పుగోదావరి జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.