అందుకే విజయం లభిస్తోంది : నాని

majnumajnu3majnu2

తన ప్రతి సినిమా ఒక డ్రీమ్‌ రోలేనని, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్లే విజయాలు సొంత చేసుకుంటున్నానని సినీ హీరో నాని చెప్పాడు. ఆయన నటించిన ‘మజ్ను’ సినిమా విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అనుశ్రీ థియేటర్‌ మేనేజర్‌ విష్ణు, సుంకర బుజ్జి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ తన సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ నేను లోకల్‌’ అనే సినిమాలో నటిస్తున్నా’ అన్నాడు. ‘రాజమౌళితో సినిమా లేదు. ఒకవేళ ఉంటే ఇలా ఉంటానా. పెద్ద మీటింగ్ పెట్టి సంతోషం పంచుకుంటా’ అని చెప్పాడు.
హీరోయిన్‌ అను ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ విజయాల హీరో నానితో తాను నటించడం చాలా ఆనందంగా ఉందని. చెప్పింది.
చిత్ర దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ తన తొలిచిత్రం ఉయ్యాల జంపాల సమయంలో రాజమహేంద్రవరంతో అనుబంధం ఏర్పడిందన్నారు. మజ్ను ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. అనంతరం చిత్ర యూనిట్‌ మజ్ను సినిమా ప్రదర్శింపబడుతున్న అనుశ్రీ, నాగదేవి థియేటర్లకు వెళ్లి సందడి చేసింది.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=majnu%20movie%20review

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.