అక్టోబర్ 1నుంచి విజయ దుర్గా పీఠం లో శరన్నవరాత్రి వేడుకలు

  vijayadurga

తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలోని శ్రీ విజయదుర్గా పీఠం దసరా ఉత్సవాలకు సమయాత్తమవుతోంది. అక్టోబర్ 1నుంచి 11 వ తేదీ (అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి) వరకు శ్రీ విజయ దుర్గా శరన్నవరాత్ర మహాత్సవాలు జరగనున్నాయని పీఠం అడ్మినిస్ట్రేటర్‌ శ్రీ వి.వి.బాపిరాజు తెలిపారు. వెదురుపాక గాడ్ ప్రతిరోజూ బొట్టు పెట్టి తీర్ధం ఇస్తారు. భక్తులు స్వయంగా శ్రీ చక్రార్చన చేసుకోవచ్చు. 2 న భక్తులకు దీక్షా కంకణ ధారణ జరుగుతుంది.  అక్టోబర్‌ 1న కలశ స్థాపన చేస్తారు. అదే రోజు అమ్మవారు శ్రీ విజయ దుర్గాదేవి రజిత కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 2న శ్రీబాలా త్రిపుర సుందరిదేవిగా, 3న అన్నపూర్ణదేవి అవతారంలో, 4, 5 న గాయత్రీ దేవి అవతారంలో, 6న లలితా త్రిపుర సుందరి దేవీ, 7న సరస్వతీ దేవీ అవతారంలో, 8న మహలక్ష్మీ రూపంలో, 9న దుర్గాదేవి స్వరూపంలో,10న మహిషాసుర మర్ధిని దేవీ రూపంలో, 11న శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వరూపంలో దర్శనమిస్తారు.
ఈ సందర్భంగా 2 వ తేదీ నుంచి 11 వరకు కంచి పీఠం ఆస్ధాన విద్వాంసులు డా.గంటి దత్తాత్రేయ శర్మ, 3న టిటిడి పండితులు ఆకెళ్ళ విభీషన శర్మ, 4న రేమెళ్ళ అవధాని వేద పండితులు, 5న గురు సహస్రవధాని డా.కడిమెళ్ళ వరప్రసాద్‌, 6న సాహితీవేత్త డా.వద్ధిపర్తి పద్మాకర్‌, 7న డా.ధూళిపాళ మహదేవమణి, డా. ధూళిపాళ అన్నపూర్ణల ప్రవచనం, 8న సాహితీవేత్త మైలవరపు శ్రీనివాసరావు , 9న టిటిడి పండితులు ప్రయాగ రామకృష్ణ, 10న భాగవత విరించి డా. టి.నారాయణరావుల ప్రవచనాలు జరుగుతాయి. 11న శ్రీ విజయ దుర్గాదేవి రథోత్సవం, కలశ ఉద్వాసన జరుగుతాయి.7న శుక్రవారం మూలా నక్షత్రం నాడు సాయంత్రం విద్యార్ధులతో సరస్వతీ దేవీకి ప్రత్యేక అర్చన జరుగుతుంది. ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది. భక్తులు యావన్మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=vijaya%20durga%20peetham

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.