అక్టోబర్ 25న తెలుగు పలుకు ‘కంఠస్థ పద్యలేఖన పరీక్ష

నన్నయ సారస్వత పీఠమ్ ఏర్పాట్లు 

padyam

       ఆదికవి నన్నయ నడయాడిన రాజమహేంద్రవరంలో 2012లో  ఏర్పాటైన  నన్నయ సారస్వత పీఠమ్ నెల నెలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ,  తెలుగు పద్యం పట్ల మమకారం పెంచడానికి , ప్రతిఒక్కరికీ చిన్ననాటినుంచీ పద్యం   రావాలన్న  సంకల్పంతో   గడిచిన మూడేళ్ళుగా తెలుగు పలుకు ‘కంఠస్థ పద్యలేఖన పరీక్ష’ నిర్వహిస్తూ, ఈ ఏడాది కూడా ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. సంస్థ   ఆధ్వర్యాన అక్టోబర్ 25వ తేదీ ఉదయం 11.30 నుంచి  12.30గంటలవరకు రాజమండ్రి ,పరిసర ప్రాంత విద్యార్ధులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం 9 పరీక్ష కేంద్రాలను రాజమండ్రిలో ఎంపిక చేసారు. మొత్తం నాలుగు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. ఒక్కొక్క విభాగానికి స్థాయిని బట్టి  పది పద్యాలను దరఖాస్తు పత్రంతో జోడించి  ఇస్తారు. ప్రశ్న పత్రంలో కూడా వీటిని ఇస్తారు. అయితే ఇందులో ఐదింటిని చూడకుండా రాయాలి. ప్రతివిభాగంలో ప్రధమ , ద్వితీయ , తృతీయ బహుమతులుగా , అలాగే ,ప్రోత్సాహక , ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులుగా ఉపయోగపడే పుస్తకాలను అందిస్తారు. ఈనెల 23నుంచి దరఖాస్తు పత్రాలు ఆయా కేంద్రాలలో  అందుబాటు లో వుంటాయి. విధివిధానాలు గురించి వివరించడానికి రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉదయం సంస్థ గౌరవ అధ్యక్షులు ఆచార్య శలాక రఘునాధ శర్మ , అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి , వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి శ్రీ సిబివి ఆర్ కె (దివాన్ చెర్వు) శర్మ , ఆదిత్య సంస్థల డైరెక్టర్ శ్రీ ఎస్పీ గంగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. శ్రీ పెరుమాళ్ళ రఘునాద్  , శ్రీ వివి సుబ్రహ్మణ్యం , శ్రీ మంగళంపల్లి విఠల్ తదితరులు పాల్గొన్నారు.

పద్యం చదవడం ఓ వ్యాయామం : ఆచార్య శలాక 

‘మనదైన తెలుగు పద్యం చదవడం వలన దవడలకు మంచి వ్యాయామం. ముఖం కూడా వికసిస్తుంది. అందుకే చిన్నతనం నుంచీ పద్యం పై ఆసక్తి పెంచాలి. దీనివలన ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది.  నేను భాషాప్రవీణ చదివేటప్పుడు 1600 పద్యాలు నేర్చుకున్నాను. సహస్రావదాని మేడసాని మోహన్ యాభై , అరవై వేల పద్యాలు నేర్చుకున్నారు. రామప్ప అనే వ్యక్తి ముప్పై , నలభై వేల పద్యాలు నేరుచుకున్నారు. తనను తాను సంస్కరించుకోడానికి , ఇతరులను సంస్కరించడానికి పద్యం దోహదపడుతుంది. వేదాంగములలో ఉన్న శిక్షా శాస్త్రం ప్రకారం అక్షరానికి   వర్ణ , స్వర , అర్ధ , ఫల , సామ , సంతానం అనే లక్షణాలు వున్నాయి. సంస్కృత భాష కన్నా తెలుగు భాష గొప్పది. ఎన్నో భాషల పదాలు ఇందులో ఇమిడాయి. అయినా  ప్రతీ దానికి తెలుగు పదం వుంది. అందరూ  పద సంపదను పెంచుకోవాలి.  తెలుగు   ఇక ప్రశ్న పత్రంలో కూడా పది ప్రశ్న లిచ్చి ఐదు  ప్రశ్న లకే జవాబు వ్రాయమంటే , మొదటి ఐదు వ్రాసే వాణ్ని ఆవిధంగా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అసలు ఆప్షన్ అన్నది ప్రశ్న పత్రంలో వుండకూడదు’అని ఆచార్య శలాక రఘునాధ శర్మ వివరించారు.

పద్యం అందరికీ రావాలి:డాక్టర్ రామారెడ్డి 

డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ తప్పుల్లేకుండా , పద దోషాలు లేకుండా పద్యం అందరికీ రావాలని అన్నారు. పెల్లల్లో పద్యం పట్ల ఆసక్తి పెంచడానికి తమ సంస్థ పక్షాన ‘కంఠస్థ పద్యలేఖన పరీక్ష’ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 23 నుంచి అక్టోబర్  18వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.   త్వరలో సంస్థ పేరు కూడా నన్నయ వాజ్మయ వేదికగా రూపాంతరం చెందగలదని ఆయన సూచించారు .

నియమ నిబంధనలు ఇవే :

పోటీలకు సంబంధించి నియమ నిబంధనలను ప్రధాన కార్యదర్శి శ్రీ దివాన్ చెర్వు శర్మ వివరించారు.

5,6,7 తరగతుల విద్యార్ధులను ఒక విభాగంగా(పరీక్ష రుసుము ఇరవై రూపాయలు ) ,   8,9,10తరగతులను మరో విభాగంగా(రుసుము ఇరవై ఐదు రూపాయలు ) , ఇంటర్ – గ్రాడ్యుయేషన్ విద్యార్ధులను ఇంకో విభాగంగా(రుసుము ముప్పై రూపాయలు ) , పిజి – ఆపై స్థాయి విద్యార్హులను ఓ విభాగంగా(రుసుము నలభై రూపాయలు ) విభజించి పరీక్ష నిర్వహిస్తారు.

ఒక్కొక్క విభాగానికి స్థాయిని బట్టి  పది పద్యాలను దరఖాస్తు పత్రంతో జోడించి  ఇస్తారు.

ప్రశ్న పత్రంలో కూడా వీటిని ఇస్తారు. అయితే ఇందులో ఐదింటిని చూడకుండా రాయాలి.

పద్యం వ్రాసేటప్పుడు పాద క్రమం తప్పకూడదు. అరసున్నా , బండి ‘ఱ’లను పద్యంలో వున్నట్లు వ్రాయాలి. సరళాదేశములు , ఒత్తు అక్షరములు పద్యంలో ఉన్నట్లుగా వ్రాయాలి.

ప్రతి పద్యమునకు పది మార్కులు . అందమైన చేతివ్రాతకు ప్రత్యేకంగా ఐదు మార్కులు.

సమాధాన పత్రం పరీక్షా సమయమున ఇస్తారు. రాజమండ్రి నగరపాలక సంస్థ , పరిసర గ్రామీణ ప్రాంత పరిధిలోని , ప్రభుత్వ , ప్రైవేట్ , మున్సిపల్ , ఎయిడెడ్ , అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల , విశ్వ విద్యాలయాల విద్యార్దులకు మాత్రమే ఈ పరీక్ష .

సంబంధిత విద్యాసంస్థల నుంచి హెచ్ ఎం , ఉపాధ్యాయులలో ఎవరో ఒకరి సంతకం తప్పని సరి. సంతకం చేసిన వారి హోదా కూడా వ్రాయవలెను.

దరఖాస్తు ఫారం ఖరీదు రెండు రూపాయలు. దరఖాస్తు పూర్తిచేసి ఇచ్చేటప్పుడు పరీక్ష రుసుము నుంచి  రెండు రూపాయలు మినహాయిస్తారు.

ఖాళీ దరఖాస్తు ఖరాబు కాకుండా స్వచ్చంగా ఉన్న పక్షంలో రెండు రూపాయలు తిరిగి ఇస్తారు.

దరఖాస్తు ఏ కేంద్రంలో కొన్నా , పూర్తిచేసి , ఏ కేంద్రంలోనైనా ఇవ్వవచ్చు.

ఈనెల 23 నుంచి అక్టోబర్  18వ తేదీ వరకు దరఖాస్తులు విక్రయిస్తారు.

అక్టోబర్ 25వ తేదీ ఉదయం 11.30 నుంచి  12.30గంటలవరకు పరీక్ష వుంటుంది.

నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు  బహుమతులు ఇస్తారు. (ప్రదేశం తర్వాత ప్రకటిస్తారు)

బహుమతులుగా నిఘంటువులు గానీ , ఉపయోగపడే పుస్తకాలు గానీ ఇస్తారు.

దరఖాస్తు విక్రయించే కేంద్రాలు :

1శ్రీమతి బిహెచ్ రమాదేవి . ఆదిత్య డిగ్రీ కాలేజి (94415 99321)

2. పెరుమాళ్ళ రఘునాద్ ,సుభాష్ నగర్ (94409 91790)

3. శ్రీ వివి సుబ్రహ్మణ్యం , ఆర్యాపురం (94901 04820)

4. శ్రీ పి. నరసింహారావు ,కటారి గార్డెన్స్ (9490343711)

5. శ్రీ చావలి రామ్మూర్తి శాస్త్రి , పేపర్ మిల్లు ,(98662 43784)

6. మంగళంపల్లి పి విఠల్, ప్రకాశం నగర్ ,(94410 37716)

7. శ్రీ ఎస్ రవికిషోర్ , లాలాచెర్వు,(86887 92211)

8.డాక్టర్ బివి ఎస్ మూర్తి జె ఎన్ రోడ్ ,(98662 90025)

9. శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పిజి కాలేజి , ఇన్నీసుపేట (86881 24895)

10.శ్రీ బోను చంద్రశేఖర్ , శంభు నగర్ ,(91770 69908)

11. శ్రీ కె సాంబశివరావు ,సైక్లోన్ కాలనీ ,(73821 33795)

12. డాక్టర్ ఎ ఎస్ వీ మహాలక్ష్మి , ధవళేశ్వరం(98665 42373).

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.