అమెరికాలో పిహెచ్‌డి చేయనున్న శీమకుర్తి రోహిత్‌ ..

చలం కుమారునికి అద్భుత అవకాశం …

rohit
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న పర్డ్యు విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేసేందుకు రాజమహేంద్రవరం నగరానికి చెందిన శీమకుర్తి రంగరోహిత్‌ అవకాశం దక్కించుకున్నాడు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ విశ్వవిద్యాలయాలలో పేరెన్నికగన్న పర్డ్యు విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా భారతదేశానికి చెందిన ఇద్దరికి మాత్రమే కెమికల్‌ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది ఆ అవకాశాన్ని ఇద్దరు విద్యార్ధులలో ఒకరు మన నగరానికి చెందిన సిద్ధార్ధ ప్లైవుడ్స్‌ పార్టనర్‌ ఎస్‌.ఎస్‌.ఎస్‌.చలం కుమారుడైన రోహిత్‌ దక్కించుకోవడం విశేషం. చిన్నతనం నుండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పదవ తరగతి వరకు స్కూల్‌ టాపర్‌గా నిలిచిన రోహిత్‌ పదవ తరగతిలో నగరంలో రెండవస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు నారాయణ ఒలింపియాడ్‌ సంస్థల్లో ప్రథమస్థానంలో నిలిచాడని రోహిత్‌ తండ్రి చలం తెలిపారు. గురువుల ప్రోత్సాహంత కెమికల్‌ ఇంజనీరింగ్‌లో ఐసిటిలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకుని ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆదివారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌కు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారులు శుభాకాంక్షలు తెలిపారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=Siddhartha+Plywoods

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.