ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

విద్వత్ కి ప్రతీక శ్రీకృష్ణమూర్తి శాస్త్రి – 150వ జయంతి ఏర్పాట్లు

sripadasripada0 sripada6sripada3sripada4sripada5sripada2

   మహామహోపాధ్యాయ , కళా ప్రపూర్ణ , కవిరాజు , కవిసార్వభౌమ , కవిబ్రహ్మ , ఆంధ్ర వ్యాస , అభినవ  శ్రీనాథ , వేద  విద్యా విశారద , ప్రసన్న వాల్మీకి , ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ద్వితీయ –  ఆంధ్రప్రదేశ్  తొలి  ఆస్థానకవి శ్రీ  శ్రీపాద  కృష్ణమూర్తి  శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళు) ఆశ్వియుజ  బహుళ  షష్టి అక్టోబర్  21 శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన జరుగుతుంది. గోదావరి గట్టునగల సమితి స్వస్థలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహిస్తారు. మాహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, రామాయణ రత్నాకర డాక్టర్ కేశాప్రగడ సత్యనారాయణ సంస్కృత భాషోద్యమ సారధి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్ (విశాఖ) సారస్వత అతిధులుగా పాల్గొంటారు. ఆరోజు ఉదయం 9గంటలకు మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి పూజాదికాలు నిర్వహిస్తారు.  శ్రీ  వెంకట  సోమయాజి ,శ్రీమతి  వెంకట  సుబ్బ  సోమి  దేవమ్మ దంపతులకు జన్మించిన శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి .ఈయన  రామాయణ  మహాభారత , భాగవతం లను తెలుగులోకి అనువదించారు. 100 పుస్తకాలకు పైగా రచించిన శతాధిక గ్రంథకర్త.  సువర్ణ గండపెండేరం సత్కార గ్రహీత. 

 

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=sripada%20krishnamurty%20sastry

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.