ఆచార్య కొంపెల్లకు ‘మహా మహోపాధ్యాయ’

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రకటన 
ఫిబ్రవరి 1న తిరుపతిలో ప్రదానం
kompella
రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ వ్యాకరణ విద్వాంసులు, విశ్రాంత ఆచార్యులు  డాక్టర్ కొంపెల్ల సత్యనారాయణ కు మహా మహోపాధ్యాయ బిరుదు ను తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రకటించింది. ఈమేరకు ఆచార్య కొంపెల్ల కు ఓ లేఖ పంపుతూ , ఫిబ్రవరి 1వ తేదీన బిరుదు ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జ్యోతిష విజ్ఞాన భాస్కర బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి , శాస్త్ర నిధి బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి మహామహోపాధ్యాయ బిరుదాంకితులు కాగా, ఇప్పుడు బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ కూడా  అందుకోబోతున్నారు. 
  తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం నరెంద్రపురంలో 1953 ఆగస్టు 8న వ్యాకరణ కేసరి – ఆదర్శ ఉపాధ్యాయ బ్రహ్మశ్రీ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి ,శ్రీమతి అన్నపూర్ణ దంపతులకు జన్మించిన బ్రహ్మశ్రీ సత్యనారాయణ నరేంద్రపురం హైస్కూల్ లో చదువుకున్నారు. ఆతర్వాత 1967- 71వరకు మోడేకుర్రు ఎస్ సి ఆర్ సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యాప్రవీణ చేసారు. 1971-73లో ప్రైవేట్ గా ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి వ్యాకరణ విద్యా ప్రవీణ పూర్తిచేసారు.1977లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి ఎం ఎ సంస్కృతం పోర్తిచెసారు. 1992లో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం నుంచి పిహెచ్ డి చేసారు. 
  ఇక ఆచార్య కొంపెల్ల 1973లో రాజమహేంద్రవరం లో శ్రీ గౌతమీ విద్యా పీఠం లో చేరి, 2000వరకు అధ్యాపకునిగా  వ్యాకరణం బోధించారు.  అనంతరం 2011వరకు కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం లో రీడర్ గా పనిచేసారు. వ్యాకరణ విభూషణ , శాస్త్ర విద్వన్మణి బిరుదులు అందుకున్న ఆచార్య కొంపెల్ల ఇప్పుడు మహామహోపాధ్యాయ కాబోతున్నారు. 
  తండ్రి బ్రహ్మశ్రీ సుబ్బరాయ శాస్త్రి , మహామహోపాధ్యాయ స్వర్గీయ పేరి సూర్యనారాయణ శాస్త్రి , మహామహోపాద్యాయ స్వర్గీయ రాణి నరసింహ శాస్త్రి దగ్గర చదువుకున్న ఆచార్య కొంపెల్ల సత్యనారాయణ తన ఉన్నతికి కారణమైన వీరిని ఎల్లప్పుడూ తలచుకుంటూ వుంటారు. వారి ఆశీర్వాద బలం వల్లనే ఇప్పుడు మహామహోపాధ్యాయ అందుకునే  స్థాయికి వచ్చానని ఆయన వినమ్రంగా చెబుతుంటారు. అయితే ఆచార్య కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి దగ్గర వ్యాకరణం , స్వర వ్యాకరణ ప్రక్రియ చదువుకున్న శిష్య గణం వివిధ ఉన్నత  పదవుల్లో స్థిరపడ్డారు.  అంతేకాదు వారు కూడా  మరెంతోమందికి విద్యను అందిస్తున్నారు. ఈ విధంగా ఆచార్య కొంపెల్ల సత్యనారాయణ నేర్చుకున్న చదువు ఇప్పుడు నాల్గవ తరానికి అందిస్తున్నారన్న మాట. మహా మహోపాధ్యా య బిరుదుకి ఎంపికయిన ఆచార్య కొంపెల్ల సత్యనారాయణ కు పలువురు అభినందనలు తెల్పారు. ఆయనకు శుభాభినందనలు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.