ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి : డాక్టర్ ఆకుల

IMA.2IMA

మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామంప్రతి ఒక్కరికి తప్పని సరి అని రాజమహేంద్రవరం సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యన్నారాయణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం ఇండియన్‌ మెడికల్‌ అసొసియేషన్‌ నగర శాఖ ఆధ్య్ష,కార్యదర్శులు డా.వేలూరి రామచంద్ర, డా.గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని వైద్యులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ‘డయాబెటీస్‌ను తరిమికొట్టండి’ అనే నినాదంతో ఆనాల వెంకట అప్పారావు రోడ్‌లోని ఈట్‌ ఎన్‌ ప్లే వద్ద సైకిల్‌ ర్యాలీని సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలిలో నగరపాలక సంస్ధ కమిషనర్‌ శ్రీ వి.విజయరామరాజు ,జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్ గన్ని భాస్కరరావు హజరయ్యారు. వైద్యులు కేశవస్వామి, రామరాజు, గూడూరి శ్రీనివాస్‌, దాట్ల భాస్కరరాజు, గోలి రామారావు, కురికూరి విజయ్‌కుమార్‌, కరుటూరి సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ అశుతోష్‌ ప్రసాద్‌, శ్యామ్‌కిరణ్‌, శర్మ, కిషోర్‌ ప్రసాద్‌, మురళి, లక్ష్మీనారాయణరెడ్డి, రామ్‌గోపాల్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, సి. సుబ్రహ్మణ్యం, జోగారావు తదితరులు పాల్గొన్నారు. సైకిల్‌ ర్యాలీ ఆనాల వెంకటఅప్పారావు రోడ్డు నుండి గోరక్షణపేట, అజాద్‌చౌక్‌, జెండా పంజారోడ్‌, పుష్కరఘాట్‌, గోకవరం బస్టాండ్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకుల మాట్లాడుతూ సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పెట్రోల్‌, డీజల్‌ను ఆదా చేసినట్టు అవుతుందని అన్నారు. అంతేగాక పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ట్లు కూడా అవుతుందన్నారు. దేశంలో షుగర్‌ వ్యాధిగ్రస్తులు రోజురోజుకి పెరుగుతున్నారని, ఆహారపు అలవాట్లలో మార్పు, వ్యాయామం తప్పనిసరి పాటిస్తే, షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని ఆయన అన్నారు. కమిషనర్‌ విజయరామరాజు మాట్లాడుతూ ఐఎంఎ ద్వారా నగరంలోని వైద్యులు మంచి కార్యక్రమం చేపట్టారని, ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వ్యాయామకం చేయాలన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.