ఆసుపత్రిలో కొనసాగుతున్న ముద్రగడ దీక్ష … The ongoing strike at the hospital mudragada

 

mudra

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాసుపత్రిలో తన ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడను సాయంత్రం అరెస్టు చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన సంగతి తెల్సిందే.

????????????????????????????????????

ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారు. శుక్రవారం సి ఐ డి కార్యాలయానికి తీసుకెళ్ళాల్సి ఉన్నప్పటికీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగించడం ఇబ్బందిగా మారింది. దీనికి తోడు నిన్నటి రోజున పురుగుల మందు కూడా సేవించినట్లు వార్తలు రావడంతో ఆసుపత్రిలోనే ఉంచాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగులు తప్ప మరెవరూ ఆసుపత్రిలోకి వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల మోహరింపుతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలు బహిర్గతం కావడం లేదు. ఆయనను పరామర్శించడానికి సైతం ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆసుపత్రి ప్రాంతం పోలీసు నీడలో వుంది. అలాగే నగరంలో ముఖ్య ప్రాంతాల్లో కూడా పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇంట పెద్దయెత్తున పోలీసులను మోహరించడం, ముళ్ళ కంచెలు వేయడం వంటివి  విమర్శలకు గురవుతోంది. 

ముందస్తు అరెస్టులు …

mudragada2
కాగా ముద్రగడకు మద్ధతుగా ఉద్యమాలు చేపట్టకుండా కొందరు నేతల్ని ముందస్తు అరెస్టు చేశారు. నగరంలో రాష్ట్ర కాంగ్రెస్‌ శిక్షణా శిబిరాల కమిటీ చైర్మన్‌ రామినీడు మురళి, మాజీ ఎం.పి. హర్షకుమార్‌ తనయుడు జి.వి.శ్రీరాజ్‌లను త్రీటౌన్‌ సిఐ రామకోటేశ్వరరావు ముందస్తుగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. రామినీడు మురళి అరెస్టయ్యారన్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ స్టేషన్‌కు చేరుకుని మురళిని పరామర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మేనిఫెస్టోలో చేర్చిన అంశాన్ని అమలు చేయాలని కోరుతున్నారని శ్రీ దుర్గేశ్ పేర్కొంటూ, అరెస్ట్‌ల వల్ల విద్వేషాలు మరింత చెలరేగి పరిస్థితి చేజారిపోతుందన్నారు. సామరస్యపూరిత వాతావరణంలో చర్చలు జరగాలని, ప్రభుత్వ జాప్యం వల్లే పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్నారు.
శనివారం నగర బంద్ కి పిలుపు …

mudragada3
ముద్రగడను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగర బంద్‌కు నగర కాపు సంఘం పిలుపు నిచ్చింది. నాయకులు ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్‌ తదితర కాపు సంఘం నేతలు తిలక్‌రోడ్‌లోని నందెపు ప్లాజాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అల్లూరి శేషు నారాయణరావు, తోలేటి ధనరాజ్‌, వడ్డి మల్లికార్జునప్రసాద్‌, మానే దొరబాబు, చిక్కాల బాబులు, కొల్లిమళ్ళ రఘు, వక్కపాటి మురళి, బాలేపల్లి మురళీధర్‌, అయ్యల గోపి, మాలే విజయలక్ష్మి, వై.కె.ఎల్‌.నరసింహారావు, ముమ్మిడి వీరబాబు, రాయవరపు పెదబాబు, రాయవరపు గోపాలకృష్ణ, సూరవరపు రామారావు, వలవల వీరభద్రరావు, అడపా వరప్రసాద్‌, ముద్దాల అను, కుమ్మరిపురుగు చిన్ని తదితరులు పాల్గొన్నారు. తుని ఘటనలో ఏ రకమైన కేసులు పెట్టబోమని ప్రభుత్వం హామీనిచ్చి ముద్రగడ దీక్షను విరమింపజేశారని, అయితే ప్రభుత్వం ఇప్పుడు కాపు జాతిని అణగద్రొక్కాలన్న ఉద్దేశ్యంతో కాపు నాయకులపై కేసులు పెడుతోంద ని నేతలు విమర్శించారు. ఆ కేసులను నిరసిస్తూ ఇంటి వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడను దౌర్జన్యంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ చేపడుతున్నామని, ఈ బంద్‌కు చాంబర్‌ కామర్స్‌, పుర ప్రజలు సహకరించాలని కోరారు. ముద్రగడ దీక్షను ప్రచారం చేస్తున్న కొన్ని ఛానళ్ళను ప్రభుత్వం నిలిపివేయించిందని, ఈ విధానాన్ని ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు.

సీబీఐ విచారణకు ముద్రగడ సిద్ధమా : రాజప్ప

 

rajap

తుని ఘటనపై సీఐడీ బాగా పనిచేసిందని ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. సీఐడీ వ్యవస్థపై వైసిపి అధినేత జగన్‌, ముద్రగడ ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొంటూ, ముద్రగడ ఒప్పుకుంటే సీబీఐకి అప్పజెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలిసి మంత్రులు చినరాజప్ప, నారాయణ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కాపులను ఉద్ధరించినట్లు జగన్‌ మాట్లాడుతున్నారని చినరాజప్ప విమర్శించారు. తుని ఘటనపై జగన్‌ సీబీఐ విచారణ కావాలని అడుగుతున్నారని.. సీబీఐకి అప్పజెప్పడానికి ముద్రగడ ఒప్పుకుంటారా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.
తుని విధ్వంసంపై ఎవరినీ అరెస్టు చేయవద్దని ముద్రగడ అంటున్నారని మంత్రి నారాయణ పేర్కొంటూ, దీన్ని బట్టి తప్పు చేసిన వారిని శిక్షించకూడదని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. తుని ఘటన వెనుక జగన్‌ పాత్ర ఉందని మొదట్నుంచీ తాము చెబుతున్నట్లు పునరుద్ఘాటించారు.

http://High drama as Mudragada dares police to arrest him – Today’s Paper …

http://Image for the news result Chinarajappa: Mudragada’s demands on release of Tuni agitators unacceptable

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.