ఇస్రో శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ … All The Best to ISRO Scientists

ఇస్రో  శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ … పుష్కరఘాట్‌లో వినూత్న కార్యక్రమం

isro5isro4    isroisro.jpg1isro3isro2

రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకు ఆలవాలం. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో కార్యక్రమం సందడి చేస్తూనే ఉంటుంది. అయితే పుష్కర ఘాట్ దగ్గర శనివారం ఉదయం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న పిఎస్‌ఎల్‌వి సి-37 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సారధి స్వచ్చంద సేవా సంస్థ, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, మేయర్‌ శ్రీమతి పంతం రజనీ శేషసాయి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు శ్రీ ఇన్నమూరి రాంబాబు అతిధులుగా పాల్గొన్నారు.,సారధి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కుడుపూడి పార్ధ సారధి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎం.డి శ్రీమతి .బాలా త్రిపుర సుందరి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌  శ్రీఎస్‌.పి.గంగిరెడ్డి, రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్‌ శ్రీ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, బొంతా శ్రీహరి, బెజవాడ రాజ్‌కుమార్‌, పెనుగొండ విజయభారతి, రెడ్డి పార్వతి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, పిల్లి నిర్మల, రాజమండ్రి రైజింగ్‌ అడ్మిన్‌ మాటూరి సిద్ధార్థ, కార్టూనిస్ట్‌ శేఖర్‌, విజ్జల అప్పయ్యశాస్త్రి, అక్షరశ్రీ స్కూల్‌ ఎం.డి. శ్రీమతి నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్ధులు రాకెట్‌ లాంచర్‌ ఆకారంలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ పుష్కరఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సంతకాల బ్యానర్‌పై తొలిగా ఎం.పి. శ్రీ మురళీమోహన్‌ సంతకం చేసి మాట్లాడుతూ గతంలో అందరూ కలెక్టర్‌, ఇంజనీర్‌, డాక్టర్‌ అవుతానంటూ తన లక్ష్యాన్ని విద్యార్ధులు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం అబ్దుల్‌ కలాం మాదిరిగా శాస్త్రవేత్తను అవుతామంటూ చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మన శాటిలైట్లను పంపేవారమని, కానీ ఇప్పుడు మాత్రం మనదేశం నుండే ఇతర దేశాల శాటిలైట్లను కూడా పంపేస్థాయికి ఎదిగామని చెప్పారు. పిఎస్‌ఎల్‌వి సి-37 కూడా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా మీలో ఎంతమంది శాస్త్రవేత్తలు అవుతారంటూ ఎంపీ శ్రీ మురళీమోహన్ ప్రశించంగా చాలామంది విద్యార్థులు చేతులు ఎత్తారు.
సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పిఎస్‌ఎల్‌వి సి-37 ప్రయోగంలో అమెరికాకు చెందిన శాటిలైట్లు కూడా ఉండటం గర్వకారణమని, ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. మేయర్‌ శ్రీమతి రజనీ శేషసాయి మాట్లాడుతూ దేశభక్తుని, శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలియపర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్పొరేటర్‌ శ్రీ యిన్నమూరి రాంబాబు మాట్లాడుతూ విద్యార్ధులు ఉన్నతమైన కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకునే దిశగా కృషిచేయాలని సూచించారు. అబ్దుల్‌ కలాం, సి.వి.రామన్‌ వంటి వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సాయి హాస్పిటల్ ఆధ్వర్యాన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఫ్లై కెమెరాలతో గోదావరి పుష్కర్ ఘాట్ ఆనందాలను జోడించి నయనానందకరంగా ఈ కార్యక్రమాన్ని వీడియోలో బంధించారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv+raghavarao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=isro+scientist+satellite

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.1.69i60j69i59l2j69i60l3.2507j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=murali+mohan

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=pantham+rajani+sesha+sai

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=dr+akula+satyanarayana

https://youtu.be/6QlsIc08QPA

 

 

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.