47 ఏళ్ళ వయస్సులో పది ఉత్తీర్ణత
చిన్నతనం లో ఆర్దిక ఇబ్బందుల వల్ల చదువు ను మధ్యలో ఆపివేసినా ఆమెకు అంతరంగంలో చదువుకోవాలనే కోరిక అలానే ఉండిపోయింది. అయితేనేం పట్టుదల, కృషి ఆమెను ఆదిశగా నడిపించాయి. పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే కాకుండా ,ఆయాగా పనిచేస్తూ , ఆమె 47ఏళ్ళ వయస్సులో పదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. వివరాల్లోకి వెళితే గత 20 సంవత్సరాలుగా రాజమండ్రి కంబాలపేట చున్నిలాల్ జాజూ ప్రాధమిక పాఠశాల లో ఆయా గా పనిచేస్తున్న చల్లా రంగమ్మ విజయ గాద ఇది. తన పిల్లలను ఉన్నత చదువులను చదివించి ,జీవితంలో స్థిరపడేలా చేసి .. తాను ఉద్యోగం చేసుకుంటూనే చదువుకోవాలన్న ఆకాంక్షను ప్రధానోపాధ్యాయిని రాజ్యలక్ష్మి కి తెలియ చేయగా ,ఆమె గత సంవత్సరం ఓపెన్ స్కూల్ లో ప్రవేశాన్ని కల్పించి ,చదువుకునేలా ప్రోత్సహించారు. ఫలితంగా రంగమ్మ గత మే నెల లో జరిగిన సార్వత్రిక పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది . చున్నిలాల్ జాజూ ప్రధానోపాధ్యాయులు కె. కోటిలింగం చేతుల మీదుగా బుధవారం ఉత్తీర్ణతా ధ్రువ పత్రాన్ని పొందారు . ఈ సందర్భం గా ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎస్. రాజ్యలక్ష్మి , ఉపాధ్యాయులు ఎల్. ప్రభాకర రావు , కె. మహాలక్ష్మీ రావు,,తదితరులు రంగమ్మ ను అభినందించారు