ఎయిడెడ్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

ఎ పి టి జి.రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చిన్నప్ప విజ్ఞప్తి

teachers
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీచర్స్ గిల్డ్ జనరల్ సెక్రెటరీ శ్రీ ఎల్ కే చిన్నప్ప కోరారు . రాజమండ్రి జాంపేట లూధరన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సదస్సులో రాష్ట్ర కార్యవర్గం పాల్గొంది . ఈ సందర్భం గా శ్రీ చిన్నప్ప మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను ఈ డిసెంబర్ నెలాఖరు లో గా పరిష్కరించకుంటే జనవరి నుండి పోరాటం ప్రారంభిస్తామన్నారు . రాష్ట్ర విభజన నేపధ్యం లో ఆగిపోయిన ఎయిడెడ్ ప్రమోషన్ లు ఇంతవరకూ ఇవ్వక పోవడం శోచనీయ మని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు డి సురేష్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ ఇమ్మానియేల్ తదితరులు ప్రసంగించారు . రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి చిట్టిబాబు ఆద్వర్యం లో ఈ సదస్సు జరిగింది . రాజమండ్రి  ఎయిడెడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.