ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలి

జిల్లా వర్తక సదస్సులో వర్తక నేతల పిలుపు

PHOTO

‘ధరల పెరుగుదలకు వర్తకులను బాధ్యులను చేసేవిధంగా యంత్రాంగం వ్యవహరిస్తూ , దాడులు చేయడం , సరుకు సీజ్ చేయడం వంటి చర్యలకు దిగడం దారుణం . సరుకు డిమాండ్ – సరఫరా సూత్రానికి తగ్గట్టు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి . ప్రభుత్వం ఎక్కువ రేటుకి కొనుగోలు చేస్తూ , తక్కువ రేటుకి అందిస్తోంది . అయితే వర్తకులను కూడా అలాగే చేయమంటే ఎలా ? దీనివల్ల సగటు చిన్నవర్తకుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు .  ఇక అధికారులు తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ వర్తకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అదే సమయంలో బడా వ్యాపార, బహుళ జాతి వ్యాపార సంస్థల జోలికి వెళ్ళకుండా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారు.   ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి , వర్తకులకు ఇబ్బంది లేకుండా చూడాలి . లేకపోతే వర్తకులు వీదికేక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది .  ఇలాంటి సమయంలో వర్తకులు ఐక్యతతో ముందుకు వెళుతూ, సమస్యలను పరిశారించుకోవాలి , అందుకు సన్నద్ధం కావాలి ‘ అని జిల్లా వర్తక సదస్సులో వక్తలు పిలుపు నిచ్చారు.  ఇటీవల తరచూ వర్తకులపై దాడులకు దిగుతూ , సరుకులని సీజ్ చేస్తున్న నేపధ్యంలో జిల్లా స్థాయి అత్యవసర వర్తక సదస్సు రాజమండ్రి  చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన చాంబర్ లోని శ్రీ కొత్త రాంబాబు మెమోరియల్ హాలులో ఆదివారం ఉదయం నిర్వహించారు. చాంబర్ అధ్యక్షులు శ్రీ అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సదస్సుకార్పొరేటర్ శ్రీ  ఇన్నమూరి రాంబాబు వందేమాతర గీతంతో ఆరంభమైంది. చాంబర్ గౌరవ కార్యదర్శి శ్రీ బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు స్వాగతం పలికారు. కాకినాడకు చెందిన శ్రీ గ్రంధి నారాయణరావు (బాబ్జి )తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసారు . నగరంలోని వివిధ వర్తక సంఘాల ప్రతినిధులతో పాటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల వర్తక ప్రతినిధులు హాజరయ్యారు. చాంబర్ వార్షిక నివేదికను మాజీ ఎం ఎల్ ఎ – చాంబర్ మాజీ అధ్యక్షుడు శ్రీ రౌతు సూర్యప్రకాశరావు , శ్రీ గ్రంధి బాబ్జి ఆవిష్కరించారు .

వర్తకునిపై నిందలు తగవు :రౌతు 

‘సమాజంలో సమయపాలన లేకుండా పనిచేసే వర్తకుడిని ముద్దాయిగా చూపించే చర్యలు మంచివి కావు . వర్తకుడు సొంతొషంగా ఉంటేనే సమాజానికి మంచింది . పన్నులు కడుతూ గౌరవ ప్రదంగా జీవించే వర్తకుడిని ఇబ్బందుల పాలు చేయడం తగదు . డిమాండ్ – సప్లై ఆధారంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడితే , ధరల ప్రభావం అంతగా వుండదు’ అని శ్రీ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. గతంలో టర్నోవర్   టాక్స్ ,ఎంట్రీ  టాక్స్ విషయంలో రాజమండ్రి చాంబర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తూ , ఐ క్యతతోనే వర్తకులు సమస్యలు పరిష్కారమవుతా యన్నారు. వర్తకులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి , వాణిజ్య పన్నుల శాఖా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఒక వర్తకుదిగానే ఈ సమావేశాని కి వచ్చానని ఆయన చెప్పారు.

చిన్న వర్తకుడు బలైపోతున్నాడు :జైన్ 

‘ధరలు పెరిగినపుడు ఎవరో ఒకరిని బాధ్యులను చేయడం అలవాటైపోయింది . దీనివలన చిన్న వర్తకుడు బలైపోతున్నాడు . కందిపప్పు ధర పెరిగితే , ప్రభుత్వం నాగపూర్ నుంచి కిలో 150రూపాయలకు కొనుగోలు చేసి , 50రూపాయల చొప్పున వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈసాకుతో వర్తకుడిని కూడా తగ్గించి అమ్మమంటే ఎలా ? ఇక అధికారులు ఎదో ఓ సాకు చూపించి వర్తకులను ఇబ్బంది పెట్టడం రివాజైపోయింది. ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకుని అవినీతి తగ్గించేలా చూడాలి . వర్తకులను ఇబ్బందుల నుంచి కాపాడాలి ‘ అని శ్రీ అశోక్ కుమార్ జైన్ అన్నారు . ఈ దశలో అమలాపురం చాంబర్ నుంచి వచ్చిన శ్రీ సలాది నాగేశ్వరరావు మాట్లాడుతూ , కందిపప్పు వంటి ధరలు పెరిగిన వస్తువులను మనం అమ్మకుండా వుంటే మంచిదని అన్నారు. పలువురు వర్తక నేతలు మాట్లాడారు అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు.  తీర్మానం ప్రతులు .

12

 

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.