కాంగ్రెస్‌ పార్టీ ట్రైనింగ్‌ కాంపైన్‌ ఛైర్మన్‌గా రామినీడి మురళి

raminidi

కాంగ్రెస్‌ పార్టీ ట్రైనింగ్‌ కాంపైన్‌ ఛైర్మన్‌గా పిసిసి కార్యదర్శి శ్రీ రామినీడి మురళి నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. పిసిసి ఛైర్మన్‌ ఎన్‌ రఘువీరారెడ్డిని సమన్వయం చేసుకుని 13 జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలను శ్రీ మురళి నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న 70వేల మందిని సుశిక్షితులైన కార్యకర్తలుగా తీర్చిదిద్దే బాధ్యత మోయాల్సి వుంది. అసలే కాంగ్రెస్ పార్టీ ఎపిలో గడ్డు పరిస్థితిలో వుండగా , పార్టీ విధానాలు సిద్ధాంతాలు తెలియజేయడం, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అండగా నిలబడి ఏవిధంగా పోరాడాలన్న విషయాలను కార్యకర్తల తెలియజేసి, రానున్న కాలంలో పార్టీ చేపట్టే ప్రజా ఉద్యమాల్లో వారిని సైనికులుగా ముందుకు నడిపించే బృహుత్తరమైన బాధ్యతను మురళిపై పార్టీ మోపుతోంది. ఏడాది కాలంపాటు పార్టీలో కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది. శిక్షణ అనంతరం 70వేల మందితో భారీ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో నిర్వహిస్తారు. గతంలో జిల్లా యూత్ కాంగ్రెస్ , కాంగ్రెస్ లలో వివిధ పదవులు నిర్వహించిన శ్రీ మురళి కొత్త భాద్యతల నేపధ్యంలో మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో పార్టీకి అండగా నిలిచి ప్రజాపోరాటాలు నిర్వహించేలా సిద్ధం చేస్తామన్నారు. డిసిసి అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ రామినీడి మురళిపై కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద బాధ్యతే పెట్టిందని , అయితే తన బాధ్యతలను నెరవేర్చడంలో శ్రీ మురళి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీ మురళీ నియామకంపై పలువురు నాయకులు , కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ , అభినందనలు తెల్పారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.