కేంద్ర వైఖరి పట్ల ‘పవన్’ గుర్రుగా ఉన్నట్టా?

    photo

    ‘సీమాంధ్రకు ఇచ్చిన హామీల మాటపై వెనక్కి తగ్గితే బీజేపీకే నష్టం. ప్రత్యేక హోదా గానీ , ప్రత్యేక ప్యాకేజిపై గానీ కేంద్రం నుంచి నిర్ణయం వచ్చాకే భవిష్యత్ నిర్ణయం వుంటుంది. ఒకవేళ ఇచ్చిన హామీలను “అమలు చెయ్యను” అని కేంద్రం అంటే నా రియాక్షన్‌ వేరుగా ఉంటుంది’ అంటూ జనసేన అధినేత, సినీ హీరో శ్రీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం చూస్తుంటే, కేంద్రం వైఖరి పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది. బీజేపీకి వ్యతిరేక ఫలితాన్నిచ్చిన బిహార్‌ ఎన్నికల తీర్పుపై స్పందించేందుకు పవన్‌ నిరాకరి స్తూనే, ఎపికి ఇచ్చిన హామీలు విస్మరిస్తే , ఎదురు దెబ్బ తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుబోమని పవన్‌ పరోక్షంగా కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం ఇకనైనా హామీల్నిన నెరవేరుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కల్సి గన్నవరం చేరుకున్న పవన్ కి ఘన స్వాగతం లభించింది. పంచె కట్టుతో హాజరైన ఆయన కారులో సిఎమ్ కాంప్ కార్యాలయానికి వెళ్లి, ఎపి సిఎమ్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. షూటింగ్ కారణంగా అమరావతి శంకుస్థాపన కు రాలేకపోయానని , అందుకే సిఎమ్ చంద్రబాబుని అభినందించడానికి వచ్చానని అయన చెప్పారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆయన స్పందించారు. చంద్రబాబుతో తన సమావేశంలో ప్రత్యేక హోదాపై కూడా చర్చించామన్నారు . మీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు “చేస్తామంటున్నారుగా .. చూద్దాం” అని వ్యాఖ్యానించారు. ప్తత్యేక హోదాపై ఉద్యమించడం కంటే పద్దతి ప్రకారమే సాధించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాక్సైట్ తవ్వకాల అంశాన్ని కూడా చర్చించానని ఆయన చెబుతూ విశాఖ ఏజన్సీ గిరిజనులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై చర్చించలేదని ఆయన స్పష్టం చేసారు. జనసేన ను విస్తరించే డబ్బు తన దగ్గర లేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  ఇక  ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇచ్చే ప్రకటనను బట్టి తన స్పందన ఉంటుందని చెప్పడం ద్వారా కేంద్ర వైఖరి మీద పవన్ సీరియస్ గా వున్నారని అర్ధం చేసుకోవచ్చా ? ఒక వేళ ఇప్పట్లో ఏదీ తేల్చకపోతే , పవన్ వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది  వేచి చూడాల్సిందే. 
కాగా రాజకీయ పరంగా కీలక చర్చ ఉంటుందని ఊహాగానాలు చెలరేగినా , అలాంటి ప్రస్తావన వచ్చినట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా కాపుల కోసం ఏర్పాటుచేసే కార్పోరేషన్ చైర్మన్ గిరీ ఎవరికీ ఇవ్వాలన్న దానిపై కూడా చర్చ ఉంటుందని వార్తలోచ్చినా , అయితే అసలు ఈ ప్రస్తావన లేదని వినవస్తోంది. గతంలో తుళ్ళూరు , ఉండవల్లి తదితర ప్రాంతాలలో పర్యటించి , రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ భూసేకరణ చేయవద్దని , రైతులను  ఒప్పించి ఏదైనా చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో  ఎవర్నీ బలవంతం పెట్టి భూముల్ని తీసుకోవడం లేదని పవన్‌కు చంద్రబాబు వివరించినట్లు , దానికి పవన్ కృతజ్ఞతలు తెల్పినట్లు చెబుతున్నారు.  మొత్తానికి 3గంటల పాటు సాగిన చంద్రబాబుతో సాగిన సమావేశం అనంతరం కారు దాకా సిఎమ్ వచ్చి మరీ పవన్ ని సాగనంపారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.