కొత్తపల్లి జానకి “హైందవ పుణ్యస్త్రీలు ” ఆవిష్కరణ

kotta

     స్త్రీ మనోభావాలను ఆవిష్కరించే మరిన్ని రచనలు శ్రీమతి కొత్తపల్లి జానకి చెయ్యాలని చిడిపి గ్రామ ప్రముఖులు శ్రీ పరస హనుమంత రావు అభిప్రాయ పడ్డారు . చిడిపి రామాలయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో వర్ధమాన రచయిత్రి శ్రీమతి కొత్తపల్లి జానకి రచించిన “హైందవ పుణ్యస్త్రీలు ” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు . ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగిన రచయిత్రి కనుక సాధారణగృహిణి , స్త్రీ మనస్తత్వాన్ని తన రచనల లో పొందుపరచ గలిగిందన్నారు .సభకు అధ్యక్షత వహించిన ప్రజాపత్రిక సుదర్శన్ మాట్లాడుతూ రాజమండ్రి కి చెందిన కొత్తపల్లి జానకి తన స్వగ్రామమైన చిడిపి లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం ముదావహం అన్నారు . ఆమె రచించిన కృష్ణవేణి ,జ్ఞానోదయం ,ఎవరా సుందరి కధలు రాజమండ్రి దినపత్రిక లో డైలీ సీరియల్ గా ప్రచురితమయ్యాయన్నారు . ఐదుగురు హైందవ స్త్రీ మూర్తుల త్యాగ నిరతిని ఈ రచన లో వివరించారన్నారు . తాళ్ళపూడికి చెందిన జయధ్వని పత్రిక ఎడిటర్ శ్రీ పరస రాధాకృష్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు . ప్రముఖ నఖ చిత్రకారుడు శ్రీ రవి పరస,ఉపాధ్యాయులు శ్రీ పరస జగన్నాధరావు ,శ్రీ ప్రభాకరరావు ,రచయిత్రి కుమారులు ఉప్పాజీ ,అప్పాజీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు .

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.