క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ నూరేళ్లు కొనసాగాలి 

రజతోత్సవ సభలో పలువురు ఆకాంక్ష 
chandrasekhar
 ” ఏదో ఆషామాషీగా కాకుండా, చిత్తశుద్ధి, అంకితభావం మేళవించి పనిచేస్తూ, స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ) అంటే ఏమిటో చేసి చూపించిన క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ నూరేళ్లు కొనసాగాలి. ఎన్ని ఒడిదుకులెదురైనా సారీ మొక్కవోని దీక్షతో సంస్థను ముందుకు నడిపించిన ఎన్.ఎన్.ఎస్. చంద్ర శేఖర్ వేసిన బాట స్ఫూర్తిదాయకం. మరిన్ని సేవలతో ఈ సంస్థ ముందుకు కొనసాగాలి”అని పలువురు వక్తలు ఆకాంక్షించారు. క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ 25వసంతాల సందర్బంగా రజతోత్సవ వేడుక రాజమండ్రిలో శనివారం సాయంత్రం ఏవి అప్పారావు రోడ్డు బైబిల్ ప్లేస్ వెనుక గల భవనంలో నిర్వహించారు. న్యాయవాది శ్రీమతి స్వర్ణలత సభను నడిపించారు. ముందుగా నేషనల్ ఏలియన్స్ ఆఫ్ వాలంటీర్స్ మీటింగ్ హాల్ ను నాబార్డ్ డిడిఎమ్ డాక్టర్ కెవిఎస్ ప్రసాద్ ప్రారంభించారు. క్లోత్స్ కలెక్షన్ సెంటర్ ,క్లోత్స్ సానిటరీ నాపికిన్ మేకింగ్ యూనిట్ ని డాక్టర్ వి సుధ ప్రారంభించారు. సీనియర్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డి అశోక్ స్వాగతం పలికారు.  
  ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి ఆహ్వానితునిగా పాల్గొంటూ, దానధర్మాలు మన సంప్రదాయంలో ఆదినుంచి ఉన్నాయని అయితే తక్కువ వనరులున్న చోట ఎక్కువ పని జరిగేలా సమన్వయం చేయడమే గొప్ప విషయమన్నారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుణ్ణి, విద్యా బోధనా సరిగ్గా జరగక ఇబ్బంది పడే విద్యార్థులను ఒకచోట చేరిస్తే, మంచి ప్రయోజనం చేకూరుతుందని ఆయన సోదాహరణంగా చెప్పారు.  మనుషుల అవసరాన్ని గుర్తించి వారికీ సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ ను, దాన్ని నడిపిస్తున్న చంద్ర శేఖర్ ని ఆయన అభినందించారు. 
   నాబార్డ్ డిడిఎమ్ డాక్టర్ కెవిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ధిక అసమానతలను తొలగించడానికి ఆర్ధిక నిర్వహణ ఎంతోముఖ్యమన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో కార్యక్రమాల కోసం నాబార్డు చేయూతనిస్తుందన్నారు. రుణాల పంపిణీ, వివిధ పధకాల అమలుకు ఆర్ధిక చేయూత వంటి వాటిని ఉపయోగించుకుని ఆర్ధికంగా నిలదొక్కువాలని ఆయన సూచించారు. 
 సభకు సీనియర్ న్యాయవాది ఎస్ జి రామారావు అధ్యక్షత వహిస్తూ, క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ  చేస్తున్న కార్యక్రమాలు, కొత్తగా చేయబోయే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి మధ్య చిత్తశుద్ధి గల వారధి అవసరమని ఆయన చెబుతూ ఆ అవసరాన్ని  క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ అందిపుచ్చుకుని సేవచేస్తోందన్నారు.  గిరిజన ప్రాంతాల్లో సైతం ఈ సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావిస్తూ,భవిష్యత్తులో చైల్డ్ లేబర్ అంశం మీద ఎక్కువగా దృష్టి సారించి పనిచేయాలని సూచించారు.
      కెడ్మీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేడా గురుదత్తప్రసాద్ మాట్లాడుతూ,చంద్ర శేఖర్ ఎన్నో ఇబ్బందులు అధిగమించి సంస్థను ముందుకు తీసుకెళ్లారన్నారు.  కెడ్మీలో కూడా క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ భాగస్వామ్యం ఉందన్నారు. ఆయా దేశాల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లడమే కాకుండా, ఇటీవల కూడా పలుచోట్ల అధికారులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారని ఆయన చెప్పారు.  సిబ్బంది కృషి ముఖ్యంగా అశోక్ తదితరుల పనితనం కారణంగానే ఈ సంస్థ ఈస్థాయికి చేరిందని విశ్లేషించారు. భవిష్యత్తులో ఇది వందేళ్ల పండుగ చేసుకోవాలని ఆకాంక్షించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని స్థాయిలోకి వెళ్లడం కష్టమని అందుకే ఎన్జీఓలు క్రిందిస్థాయికి వెళ్లి పనిచేస్తున్నాయని, ముఖ్యంగా చంద్రశేఖర్ ఎంతోకష్టపడి క్రియేటర్స్ చారిటబుల్ సంస్థను నడుపుతున్నందున పాతికేళ్ళకు చేరిందన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు.  చంద్రశేఖర్ తొలుత సంస్థ ఈ 25ఏళ్ళ కాలంలో క్రియేటర్స్ చారిటబుల్ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో దేశస్థాయిలో కార్యక్రమాలు చేస్తామన్నారు. మన కష్టాలు ఎలా వున్నా సరే , పక్కవాడి కష్టంలో పాలుపంచుకోవాలన్నదే తమ సంస్థ లక్ష్యమన్నారు.
    డాక్టర్ వి సుధ స్వర్ణాక్షరాలు పేరిట పలు అంశాలను వివరిస్తూ ఆరోగ్య జాగ్రత్తలను, తీసుకోవాల్సిన ఆహరం,పాటించాల్సిన నియమాలను వివరించారు. అనంతరం  కేక్ కటింగ్ జరిగింది. న్యూట్రిషన్ , దుప్పట్లను పి. లక్ష్మీశ్రీనివాస్,జి శైలజ,స్వర్ణలత రమా రాణి,క్రియేటర్స్ మెంబర్స్ తదితరులు పంపిణీచేసారు. కాగా పాతసిబ్బందికి ఈసందర్బంగా సత్కారం చేసారు. సిబ్బంది శ్రీను, అరుణ తదితరులతో పాటు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వాలంటీర్లు పాల్గొన్నారు. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.