క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

govt hospital

క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్కరూ నివారణకు కృషిచేయాలని ప్రభుత్వాసుపపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్‌ డా. కె.రాజశేఖర్‌ అన్నారు. వ్యాధిగ్రస్తులను ఆదరించి సక్రమంగా మందులు వాడేలా చేస్తే క్షయ వ్యాధిని నివారించవచ్చన్నారు. గురువారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మిడి బ్రదర్స్‌ అందించిన చీరలు, చందన బ్రదర్స్‌ బెడ్‌షీట్స్‌, జిల్లా కలెక్టర్‌ సరఫరా చేసిన పౌష్ఠికాహారం, పిఎంపి అసోషియేషన్‌ నాయకులు బళ్లా శ్రీనివాసరావు రొట్టెలను క్షయ వ్యాధిగ్రస్తులకు అందజేశారు. మాజీ ఎం.పి. జి.వి.హర్షకుమార్‌ తనయుడు శ్రీరాజ్‌ చల్లని పానీయాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌.ఎం.ఓ. డాక్టర్‌ పద్మశ్రీ, వైద్యులు ఎస్‌.జ్యోతికుమారి, డా.సాగర్‌, డా.రమేష్‌, సోషల్‌ వర్కర్‌ జి.సరళకుమారి, ఇన్‌చార్జి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.కె. జోస్మిన్‌, బళ్లా శ్రీనివాసరావు, కె.వి.వి. సత్యనారాయణమూర్తి, ఎస్‌.రమేష్‌, ఎల్‌.సతీష్‌బాబు, విహాన్‌ స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వ్యాధిగ్రస్తులకు తోడ్పాటు అందించాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.