క్షయ వ్యాధి నివారణ దినోత్సవం – ఐ ఎం ఎ ఉచిత వైద్య శిబిరం

ima

ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నటరాజ ధియేటర్‌ పక్కనే ఉన్న అంబేద్కర్‌ కమ్యూనిటీ హాలులో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు క్షయ వ్యాధి పట్ల అవగాహన సదస్సులు నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఐఎంఏ నగర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ వేలూరి రామచంద్ర, డాక్టర్‌ వై.ఎస్‌.గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు, జి.ఎస్‌.ఎల్‌.మెడికల్‌ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా టి.బి. నివారణ – తీసుకోవలసిన జాగ్రత్తలు అంశంపై శ్రీలత హాస్పటల్‌ అధినేత్రి డాక్టర్‌ అనుసూరి పద్మలత వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐఎంఏ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. డాక్టర్‌ గన్ని భాస్కరరావు సహకారంతో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా ఎక్స్‌రేలు తీయగా డాక్టర్‌ అనుసూరి పద్మలత సౌజన్యంతో ఉచిత రక్ష పరీక్షలు, ఇసిజి పరీక్షలు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, డా.కె.వి.ఆర్‌.సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ ఆర్‌.రామకృష్ణ, డాక్టర్‌ అనుసూరి పద్మలత, జి.ఎస్‌.ఎల్‌.వైద్యులు డాక్టర్‌ కొండలరావు, పి.జి. వైద్య బృందం సేవలందించారు. ఈ ఏడాది ‘టిబిని కలిసికట్టుగా తరిమి కొడదాం’ అన్న నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పద్మలత తెలిపారు. ఐఎంఏ కోశాధికారి డాక్టర్‌ గంపా వీరభద్రరావు, పలువురు వైద్యులు, మున్సిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.