ఖైదీ నంబర్‌ 150 – సమీక్ష

  కార్పొరేట్ కన్నా, రైతే మిన్న అని చాటిచెప్పే యత్నం చేసిన
ఖైదీ నంబర్‌ 150

khaidi
నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, రాయ్‌ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కాస్ట్యూమ్స్‌: కొణిదెల సుస్మిత
ఫొటోగ్ర‌ఫి: ఆర్‌.రత్నవేలు;మాటలు: పరుచూరి బ్రదర్స్‌, బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి.
నిర్మాత: రామ్‌చరణ్‌, సమర్పణ: కొణిదెల సురేఖ, కథ: మురుగదాస్‌ , దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

     సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి తాజా సినిమా ఇది. .2009 ఎన్నికల సందర్బంగా 6మాసాల ముంచు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తొమ్మిది సంవత్సరాల విరామం తరవాత ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ వెండితెరపై మళ్ళీ ప్రత్యక్షం అవుతూ మెగాస్టార్‌ నటించిన ఈ మూవీకి చిరు తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాత కావడం ఒక విశేషమైతే,. చిరంజీవి   నటించిన 150వ చిత్రం కావడం మరో విశేషం. .2017 సంక్రాంతి బరిలో మొట్టమొదట వచ్చిన ఈ సినిమా తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలిభాగం హాస్యం జోడించిన సన్నివేశాలతో సరదాగా సాగిన ఈ చిత్రం రెండవభాగం మొత్తం సీరియస్ గా నడిచింది. పంట భూములను పరిశ్రమలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ, అన్నం పెట్టె రైతన్న భూమిని నమ్ముకోడానికి పడిన కష్టం,చేసిన త్యాగం వంటి అంశాలకు ఈచిత్రం అద్దంపట్టింది. సెన్షనల్ వార్తలకోసమే మీడియా తీస్తున్న పరుగుల నేపధ్యం, రైతుల కష్టాలను విస్మరించే తీరు చూపిస్తూ, రైతు సమస్యలపై దృష్టి పెట్టేలా చూడాలని ఈ చిత్రం చాటి చెప్పింది. ఇందుకోసం ఎంచుకున్న పోరాటంలో సీనియర్ సిటిజన్స్ , రైతుల ఎలా భాగస్వాములయ్యారో చూపిన చిత్రం ఇది. ఇక పాటలు, ఫైట్లు అన్నీ చిరంజీవి మార్కుకి ఏమాత్రం తగ్గలేదు. 60దాటినా 20ఏళ్ళ కుర్రాడిలా వేసిన స్టెప్పులు   అభిమానులను  హుషారెత్తించాయి. కథ , కధనం విషయానికి వస్తే,
    కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో స్టార్ట్ అయిన ఈ మూవీ కథ కొంచెం ప్లాష్ బ్యాక్ ని టచ్ చేస్తుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.
మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను సరేనంటాడు.
    అయితే . శంకర్ రూపంలో ఉన్న కత్తి శీనుకి లయన్స్ క్లబ్ సన్మాన కార్యక్రమం తలపెట్టడం, ఈ సందర్బంగా శంకర్‌ గురించి అతని ఉదాత్త భావన గురించి పవర్ పాయింట్ ప్రాజెటేషన్ ఇవ్వడంతో రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా పరితపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో కూడా కత్తిసీనుకి అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను శంక‌ర్ గా మారిన క‌త్తిశ్రీను ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది వెండి తెరమీద వీక్షించాల్సిందే. రీమేక్ సినిమా అయినా , గతంలో ఠాగూర్ తీసిన దర్శకుడు వివి వినాయక్, గట్టి స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని మెగా అభిమానులకు నచ్చే విధంగా నడిపించాడు. 9ఏళ్లుగా దాహార్తితో వున్న అభిమానులకు దప్పిక చేసే రీతిలో తీర్చిదిద్దాడని చెప్పాలి.
చివరగా …  
     భారీ అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ 150వ చిత్రం అభిమానులను బాగా మెప్పించింది. అద్భుతమైన ఫస్టాఫ్, అందులో బలంగా ఎలివేట్ చేయబడ్డ రైతు సమస్య, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే స్టెప్పులు, అసమాన్యమైన ఆయన నటన, టైమింగ్ తో కూడిన మంచి కామెడీ ఇందులో ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా, ఏమాత్రం సినిమాను ప్రభావితం చేయలేకపోయిన పాత్రగా బలహీనమైన విలన్  పాత్ర నడిచింది, ఇక ఇందులో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా, మొత్తం మీద చూస్తే మంచి సందేశంతో చిరంజీవి ఇచ్చిన, రీ ఎంట్రీ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేలానే ఉంది. అన్నట్టు రాజమహేంద్రవరంలో రాజా థియటర్ ని ఆధునీకరించాక, అనుశ్రీ సినిమాస్ నిర్వహణలో జనవరి 9న లాంఛనంగా ప్రారంభమైంది. జనవరి 11 బుధవారం ఉదయం 6గంటల ఆటతో ఖైదీ నంబర్ 150విడుదలైంది. రాజమహేంద్రవరం లో చాలా థియటర్ లలో ఈ చిత్రం విడుదలైంది. 

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=khaidi%20no%20150

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavrao

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=r&aqs=chrome.4.69i60l3j69i57j69i59l2.2356j0j7&sourceid=chrome&ie=UTF-8

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.