గన్ని కృష్ణ ప్రెస్ మీట్ … Ganni krishna press meet

పదవి వచ్చినా, రాకున్నా.. బాబు మనిషినే
ఎం ఎల్ సి అభ్యర్థి ఎంపికపై గన్ని కృష్ణ వ్యాఖ్య

 

ganni

‘ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్నడూ చంద్రబాబునాయుడు మనిషినే. నా సేవలను, సీనియారిటీని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైనా నామినేటెడ్‌ పదవి ఇచ్చినా ఓకే… ఒకవేళ .ఇవ్వకపోయినా డబుల్‌ ఓకే…. అంతే గాని పదవుల కోసం రాజకీయంగా దిగజారడం…. కులం పేరుతో రాజకీయాలు చేయడం నా నైజం కాదు’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ స్పష్టంచేశారు. రాజమహేంద్రవరం కంబాల చెర్వు స్వతంత్ర ఏజన్సీస్ లోని ఆయన కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్బంగా వివిధ అంశాలపై పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు గన్ని కృష్ణ స్పంది స్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ‘.నాకు శాసనమండలి సభ్యునిగా పనిచేసే అవకాశం కల్పిస్తాం అని 2014 ఎన్నికల్లో పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. కొన్ని సమీకరణల వల్ల ఇప్పటి వరకు నాకు ఆ అవకాశం రాలేదు. ఇక ఇప్పుడు శాసనమండలిలో ఖాళీలు వచ్చినందున ఇప్పడా ఆ అవకాశం కల్పించమని పార్టీని కోరా. అయితే స్ధానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి చేపట్టే అవకాశం పార్టీ అధిష్ఠానం మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు కల్పించింది. అందుకు నేనేమీ బాధ పడటం లేదు. ఎందుకంటే .చిక్కాల అనుభవజ్ఞుడు, అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తి. ఇక వివిధ సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం కల్పించారని నేను భావిస్తున్నా. అందుకే ఈవిషయంలో నేనేమీ బాధ పడటం లేదు’ అని ఆయన స్పష్టం చేసారు.
. రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని,సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పార్టీ ఈవిధంగా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నా. ఆ విషయాల్లో బహుశ నా సీనియారిటీ సరిపోయి ఉండకపోవచ్చని భావిస్తున్నా…అందుకు నేనేమీ బాధ పడటం లేదు’ అని శ్రీ కృష్ణ చెప్పుకొచ్చారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నా. పార్టీ కోసం కోట్ల్లు ఖర్చు పెట్టానని, నా వెనుక క్యాడర్‌ ఉందని చెప్పుకోవడం నా కిష్టం లేదు. పదవుల కోసం గడ్డి తినడం, పదవుల్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకోవడం నా అభిమతం కాదు. ఇదే విషయాన్ని ఇటీవల అధినేత చంద్రబాబునాయుడిని కలిసి చెప్పా…అవకాశం కల్పించినా…కల్పించకపోయినా పార్టీలు, కండువాలు మార్చబోనని కూడా ఆయనకు చెప్పా. అయితే నన్ను నమ్ముకుని నా వెనుక ఉన్న వారికి న్యాయం జరగడం కోసం పోరాడతా’ అని గన్ని తేల్చిచెప్పారు. పార్టీ నా కేమీ ఇచ్చిందనే భావనతో కాకుండా పార్టీ తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వహించానని, పార్టీ కోసం పోలీస్‌ కేసుల్ని ఎదుర్కోవడంతో పాటు గతంలో ముమ్మిడివరం అసెంబ్లీ ఉప ఎన్నికలో, రాజమహేంద్రవరం రూరల్‌లో చందన రమేష్‌ విజయం కోసం, సిటీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ విజయం కోసం కృషి చేశానని గన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ కోసం తాను ఎలా పనిచేస్తున్నానో తన అంతరాత్మకు తెలుసని, అయితే కొందరు తనపై నాయకత్వానికి తప్పుడు ఫిర్యాదులు, సమాచారం ఇస్తుండటం బాధ కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక విషయంలో పలువురు పోటీ పడుతున్నందున ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ తరఫున ఐవిఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ద్వారా అభిప్రాయ సేకరణ జరిపినా ఫలితం మాత్రం బహిర్గతం కాలేదని, ఈ సేకరణలో చిక్కాలకు 78 శాతం సానుకూలత వచ్చినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని గన్ని చెప్పారు. దీనిపై తాను పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించగా ఫలితం వివరాలను బహిర్గతం చేయలేదని స్పష్టం చేశారన్నారు. చిక్కాల సీనియర్‌ నాయకులని, వివాదరహితులని, ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారని, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం తనతో సహ ఎవరికీ అయిష్టత లేదని, అయితే కొంతమంది పనిగట్టుకుని 78 శాతం సానుకూలత వచ్చినట్లు ప్రచారం చేయడం చాలా మందికి మనస్తాపం కలిగిస్తుందని గన్ని కృష్ణ అన్నారు. ఐవిఆర్‌ఎస్‌లో ఐదు పేర్లు రాగా వాటిలో తన పేరు కూడా ఉండగా, తన అభ్యర్ధిత్వానికి నగర ఓటర్లే గాక జిల్లా నలుమూలల చాలా మంది సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందని, వారందరికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శ్రీ కృష్ణ చెప్పారు.

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ragha&aqs=chrome.1.69i60j69i59j69i60l3j69i57.2460j0j7&sourceid=chrome&ie=UTF-8, https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=ganni+krishna&*

https://www.youtube.com/watch?v=ioqYXW5GBk4&t=37s

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.