గోదావరి తీరాన మల్టీఫ్లెక్స్‌ కి రంగం సిద్ధం … multiplex in Rajahmundry

  ఏ.వీ.ఏ  రోడ్డులో భూమి పూజ చేసిన ప్రసాదిత్య గ్రూప్‌
maltipleksmaltipleks.2maltipleks.3maltipleks.4maltipleks.6maltipleks.5maltipleks.7 
   చారిత్రాత్మక రాజమహేంద్రవరం సినీ పరిశ్రమకు పెట్టని కోట. ఒకప్పుడు  ఇక్కడే దుర్గా సినీ టోన్ పేరిట తొలి స్టూడియో ఇక్కడే వెలిసింది. అలాగే విజయవాడ తర్వాత తోలి సినీ థియటర్ వున్నది కూడా ఇక్కడే. ఇప్పడు మల్టీ ప్లెక్స్ కూడా రాబోతోంది. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ మల్టీ ప్లెక్స్ కోసం కసరత్తు సాగినా కార్యరూపం దాల్చలేదు.   పరిసర గ్రామాలను విలీనం చేయడానికి రంగం సిద్ధం కావడం , రాజమహేంద్రవరం – కాకినాడ కార్పొరేషన్లలో గోదావరి అర్బన్ దవలప్ మెంట్ అధారిటీ కి మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం నేపథ్యంలో   సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నగరం, పరిసర వాసులకు వినోదాల హరివిల్లు పంచేందుకు దేశ పారిశ్రామిక దిగ్గజ సంస్థ ప్రసాదిత్య గ్రూప్‌ ముందుకొచ్చింది. అందుకే  ఇంతవరకు  హైదరాబాద్‌ విశాఖ, విజయవాడ వంటి నగరాలకు పరిమితమైన మాల్‌ అండ్‌ మల్టీఫ్లెక్స్‌ను గోదావరి తీరానికి పరిచయం చేయాలని నిర్ణయించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  పెద్ద ఎత్తున మూవీ స్క్రీన్లతో మల్టీఫ్లెక్స్‌ మాల్‌లు నిర్మించాలనే సంకల్పంతో మొట్టమొదటి ప్రాజక్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థలో ఒక్కటైన ప్రసాదిత్య గ్రూప్‌ నగరంలో శ్రీకారం చుడుతోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి, 2019 విజయదశమి నాటికి ఈ ప్రాజక్ట్‌ను పూర్తి చేయాలని ఈ సంస్థ సంకల్పించింది. 
    ఈ నేపథ్యంలో   రాజమహేంద్రవరంలో తొలి మాల్‌ అండ్‌ మల్టీఫ్లెక్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి   ఏవీ అప్పారావు రోడ్డులో గెయిల్‌ కార్యాలయం ఎదురుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రసాదిత్య గ్రూప్‌ చైర్మన్‌శ్రీ  ఎం.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ శ్రీమతి  రాజ్యలక్ష్మీ దంపతులు  ఫిబ్రవరి 15 బుధవారం  ఉదయం భూమి పూజ చేశారు.   ఎం.పి. మాగంటి   మురళిమోహన్‌, సిటీ ఎం ఎల్ ఏ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు   9 వ డివిజన్‌ కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ,  మల్టీఫ్లెక్స్‌ ఆర్కిటెక్‌ ప్రసాద్‌, ప్రసాదిత్య ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్లు బోస్‌, డి.ఎన్‌.రావు, డైరక్టర్లు కె.వెంకటేశ్వరరావు, బిఆర్‌కె ప్రసాద్‌, సత్యనారాయణలతో పాటు ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు,  నగర ప్రముఖులు మధుఫోమ్రా, ఆకుల వీర్రాజు,పట్టపగలు వెంకట్రావు ,  అల్లు బాబి తదితరులు పాల్గొన్నారు. 
    అధునాతన  సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు డిజిటల్‌ మూవీ స్క్రీన్లు, బెస్ట్‌ బ్రాండ్‌ స్టోర్స్‌, ఫుడ్‌ కోర్ట్స్‌, కిడ్స్‌ గేమింగ్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ జోన్‌ వంటి సౌకర్యాలతో నగరానికి తలమానికంగా ఈ భారీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిన ఈ సంస్థ   ఇప్పటికే చైనా, జపాన్‌,సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌, ఆఫ్రికా దేశాల్లో ఐ.టి.రంగంలోనూ , 22 దేశాల్లో 45 నగరాల్లో భారీ పరిశ్రమలు నెలకొల్పి, పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగింది. దేశంలోని కేరళ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా తదితర రాష్ట్రాల్లో ఆటోమొబైల్‌, ఇంజనీరింగ్‌, పేపర్‌, పవర్‌ ప్రాజక్ట్స్‌, కెమికల్స్‌, ఫైనాన్స్‌, టెక్స్‌టైల్స్‌, టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థలను నిర్వహిస్తున్న ఈ  సంస్థ హైదరాబాద్‌లో తొలి సినిమా స్టూడియోగా ప్రసిద్ధి చెందిన సారథి స్టూడియోను 2005లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వినోద రంగాన్ని విస్తరించాలనే ధ్యేయంతో  భారీ మాల్‌ మల్టీఫ్లెక్స్‌ల నిర్మాణాలకు సంస్థ ప్రణాళిక రూపొందించి తొలి ప్రాజక్ట్‌కు రాజమహేంద్రవరంలో శ్రీకారం చుడుతోంది. పారిశ్రామిక రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలికి చెందిన ప్రసాదిత్య గ్రూప్‌ చైౖర్మన్‌ ఎంఎస్‌ఆర్‌వి ప్రసాద్‌ గోదావరి తీరవాసులకు మల్టీఫ్లెక్స్‌ను పరిచయం చేయాలనే ఆలోచనతో దీని నిర్మాణానికి సంకల్పించారు.  ఈ సందర్భంగా ఎం.పి. మురళిమోహన్‌ మాట్లాడుతూ ప్రసాదిత్య గ్రూప్‌ ప్రయత్నం విజయవంతమవుతుందని, గోదావరి తీర ప్రాంత అభివృద్ధికి, వినోదానికి వేదికగా నిలిచే దీని నిర్మాణానికి పరిపాలన పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివరికి మధురపూడి విమానాశ్రయం విస్తరణ పూర్తవుతుందని, ఆ తర్వాత ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై వంటి మహానగరాలకు బోయింగ్‌ విమానాలు రాకపోకలు సాగిస్తే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా)ను ఏర్పాటు చేసిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, నాబార్డ్‌ సహకారంతో త్వరలో ఈ నగరానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కూడా జరుగుతుందని ఆయన చెప్పారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఆలస్యమైనా రాజమహేంద్రవరం నగరంలో మల్టీఫ్లెక్స్‌ వస్తుండటం ఆనందకరమ న్నారు. అయితే ఈ ప్రాంగణంలో పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. 
   ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో మల్టీఫ్లెక్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రసాదిత్య గ్రూప్‌నకు అభినందనలు తెలిపి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం నగరంలో ఈ మల్టీఫ్లెక్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రసాదిత్య గ్రూప్‌ను అభినందించి నగర పాలక సంస్థ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మల్టీఫ్లెక్స్‌ ఆర్కిటెక్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ విస్తృతమైన పార్కింగ్‌ సౌకర్యంతో పాటు ఐదు బహుళ అంతస్తుల్లో బిగ్‌బజార్‌, ఫుడ్‌ కోర్టు, రెష్టారెంట్లు, ధియేటర్లు నిర్మితమవుతాయని, ఇందులో ఐదు లిఫ్ట్స్‌, రెండు ఎస్కరేటర్లు ఉంటాయని వివరించారు.  అగ్నిప్రమాదాలు సంభవిస్తే, సమర్ధవంతంగా ఎదుర్కోనే విధంగా నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.