గోదావరి సినీ టోన్ తొలిప్రయత్నం “మిక్సర్ పొట్లం” MIXER POTLAM MOVIE

      mixer potlammixer potlam.jpg3mixer potlam.jpg2

 రాజమహేంద్రవరం ఎన్నో రంగాలకు నిలయం. సినీ రంగం కూడా అందులో వుంది. ఈ ప్రాంతం నుంచి ఎందరో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తమ సత్తా చాటారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు,నిర్మాతలు ఇలా ఎందరో ఈ ప్రాంతం నుంచి రాణించారు. విజయవాడ తర్వాత తొలి సినీ ధియేటర్ కూడా ఇక్కడే నిర్మాణం అయింది. ఒకప్పుడు కృష్ణ, ఆతర్వాత సాయికృష్ణ ఇప్పుడు అనుశ్రీ సినిమా గా ఉన్న థియేటర్ నడుస్తోంది. ఇదే యాజమాన్యంలో దుర్గా సినీ టోన్ స్టూడియో 1935 -1936 ప్రాంతంలోనే ఇక్కడ ఏర్పడింది. సంపూర్ణ రామాయణం ఇక్కడే తీశారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, తాజాగా గోదావరి సినీ టోన్ పేరిట ఓ చిత్ర నిర్మాణ సంస్థ ఇక్కడ పుట్టింది. రాజమహేంద్రవరానికి చెందిన లయన్ డాక్టర్ కలపటపు లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ కంటే వీరన్న చౌదరి,శ్రీ లంకపల్లి శ్రీనివాస్ సంయుక్తంగా గోదావరి సినీ టోన్ పతాకంపై ‘మిక్సర్ పొట్లం’ సినిమా రూపొందించారు. తొలిప్రయత్నంగా తీసిన ఈ చిత్రం శుక్రవారం(మే19) ఉదయం విడుదలైంది. నూతన దర్శకుడు సతీష్ కుమార్ కధ అందించి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించాడు. మాధవ పెద్ది సురేష్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ఒకప్పటి హీరో భానుచందర్ తో పాటు అయన కుమారుడు జయంత్ హీరోగా నటించాడు. గీతాంజలి అనే కొత్త అమ్మాయి హీరోయిన్. కొత్త బంగారులోకం, రైడ్, కాస్కో సినిమాల త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న శ్వేతాబసు రీ ఎంట్రీ ఇస్తూ కీలక భూమిక వహించిన ఈ సినిమాలో సుమన్,పోసాని కృష్ణ మురళి, హాస్యనటులు చిట్టిబాబు, ఆలీ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, జబర్దస్త్ టీమ్ ఫణి , మురళి, అనిల్ తదితరులు ఇందులో నటించారు.
అయితే తొలిప్రయత్నంలోనే చిత్ర నిర్మాతలు ముగ్గురూ కూడా నటులుగా అవతారం ఎత్తారు. అలాగే అనూప్ జైన్,కొప్పర్తి రామకృష్ణ తో పాటు ఈయన కుమారి కొప్పర్తి భవ్య,కుమారి కలపటపు శ్రీయ (లక్ష్మి ప్రసాద్ కుమార్తె), రాజమహేంద్రవరానికి చెందిన మరికొందరు కూడా తెరపై కనిపించారు. రాజమహేంద్రవరం మేనక ధియేటర్ లో ఉదయం ఆటను నిర్మాతలలో ఒకరైన డాక్టర్ వీరన్న చౌదరి , చిత్రంలో నటించిన రాజమహేంద్రవరం వాసులు ప్రముఖులు వీక్షించారు.
కథ విషయానికి వస్తే,…..
అమ‌లాపురం నుంచి షిరిడీ వెళ్లే బ‌స్సు జ‌ర్నీ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఈ ప్ర‌యాణంలో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్లు ప‌రిచ‌య‌మైతే ఎలా ఉంటుందో చూపించారు. సుందరి ట్రావెల్స్ యజమాని సువర్ణ సుందరి (శ్వేతా బసు) తో సహా హీరో హీరోయిన్లు, కామెడియన్స్ ప్రయాణికులుగా షిర్డీ వెళ్తుంటారు. బస్సులో వివిధ క్యారెక్టర్లు నవ్వు పుట్టిస్తాయి. కామెడీ హీరోలతో సమానంగా నిర్మాత వీరన్న చౌదరి కామెడీ పండించే పాత్రలో రాణించారు. బస్సు అడవి మార్గంలో వెళ్తుంటే, కొందరు సాయుధులు దారికాచి ప్రయాణికులను కిడ్నాప్ చేస్తారు. అక్కడితో ఇంటర్ వెల్ పడుతుంది. అక్కడివరకూ కామెడీగా సాగిన కథ ఆతర్వాత ఊహించని విధంగా కథను నడిపించాడు దర్శకుడు. అసలు కిడ్నాప్ చేసిందెవరు, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, వాళ్ళు ఎలా బయట పడ్డారు వంటి విషయాలు తెరపై వీక్షించాల్సిందే. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై సెటైరిక‌ల్ కామెడీని కూడా జోడించారు. ఇందులో శ్వేత పాత్ర పేరు సువ‌ర్ణ సుంద‌రి. చింతామ‌ణి, క‌న‌క మ‌హా ల‌క్ష్మీ పాత్ర‌ల్లా ఈ క్యారెక్ట‌ర్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొన్నాళ్ల‌పాటు గుర్తుండిపోతుంది. ముఖ్యమంత్రి పాత్రలో సుమన్ ఒదిగిపోయారు. హోమ్ మంత్రిగా పోసాని పలికిన డైలాగులు రక్తికట్టాయి.
ప్లస్ పాయింట్లు …
కామెడీ బాగుంది
పాటలు పర్వాలేదు
మైనస్ పాయింట్లు… 
కధనంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది
షిరిడి యాత్రలో షిర్డీనికి చూపించకపోవడం
     మొత్తం మీద గోదావరి సినీ టోన్ పతాకంపై తొలిప్రయత్నం పర్వాలేదు. ఇక బాపు – రమణలకు ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం అభినందనీయం. ఈ బానర్ పై భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు వచ్చి , విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.