‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రివ్యూ – Gautamiputra Satakarni Movie Review

చారిత్రిక వైభవాన్ని ఆవిష్కరించిన  
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 
balayyagowtami putra 
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో  నటీనటులు: నందమూరి బాలకృష్ణ – శ్రియ సరన్ – హేమమాలిని – కబీర్ బేడి – మిలింద్ గుణాజీ – ఫరా కరిమి – తనికెళ్ల భరణి – శుభలేఖ సుధాకర్ తదితరులు ఉన్నారు. 
సంగీతం: చిరంతన్ బట్,ఛాయాగ్రహణం: జ్నానశేఖర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా,నిర్మాతలు: సాయిబాబా జాగర్లమూడి – రాజీవ్ రెడ్డి,రచన – దర్శకత్వం: క్రిష్
 నందమూరి నట వారసుడు గా పరిచయమైనా బాలకృష్ణ ఇప్పటివరకూ 99చిత్రాలు చేరి నూరవ చిత్రంగా  ‘గౌతమీపుత్ర శాతకర్ణి ‘లో నటించాడు.  ప్రారంభోత్సవం జరుపుకున్న నాటి నుంచి అభిమానుల్లో , చిత్ర పరిశ్రమలో , సినీ  జనాల్లో  ఆసక్తి రేకెత్తిస్తూ.. ఎప్పటికప్పుడు కళ్లు చెదిరే ప్రోమోలతో ఆసక్తిని మరింత పెంచుతూ వచ్చిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగు పరిశ్రమలో పది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సినిమా ఎట్టకేలకు జనవరి 12న  వెండితెరను తాకింది. మరి నందమూరి బాలకృష్ణ-క్రిష్ కలిసి చేసిన ఈ బృహత్తర ప్రయత్నం బానే ఫలించిందని చెప్పవచ్చు. భారీ సెట్టింగ్స్ తో , అద్వితీయ పోరాటాలతో ఈచిత్రాన్ని జనరంజకంగా క్రిష్ మలిచాడు.  ఇంకా చెప్పాలంటే, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’  విజువల్ గ్రాండియర్.. ఎఫెక్ట్స్.. నిర్మాణ విలువలు.. లాంటి అంశాల్లో ‘బాహుబలి’ కంటే వెనుక ఉండొచ్చు కానీ.. విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ‘బాహుబలి’ కంటే మిన్నగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉందంటే అతిశయోక్తి కాదు.
   ఇక బాలయ్య నటన , పంచ్ డైలాగులు అదిరాయి. భారత దేశ అఖండతను చాటిచెబుతూ, దేశమంతా ఒకే విధానం అమలయ్యేలా శాతకర్ణి హయాంలోనే గొప్ప ప్రయత్నం జరగడమే కాక , ఆనాటి రాజుల్లో సమైక్య భావన కూడా పాదుకొల్పినట్లు ఈ చిత్రం చాటిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం  ఏపీకి అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో అమరావతి ప్రస్తావనతో గౌతమీ పుత్ర  శాతకర్ణి రావడం ఆసక్తిని రేకెత్తించడం కూడా సహజం. తెలుగువాడి పౌరుషాన్ని,తెలుగు నేల ప్రాభవాన్ని ఈ చిత్రం మరోసారి చాటింది.  
కథ విషయానికి వస్తే,
రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలకు సంబంధించి అమ్మ చెబుతున్న కథ వింటూ.. ముక్కలు ముక్కలుగా ఉన్న భరత ఖండాన్ని ఏకం చేయాలని చిన్నతనంలోనే దృఢ నిశ్చయానికి గౌతమీ పుత్ర  శాతకర్ణి వస్తాడు. ఐదేళ్ల  వయస్సులో కన్నకలల్ని నిజం చేసే దిశగా శాతకర్ణి కధ నడిచింది. బాలయ్య వన్ మేన్ షో గా నడిచినా హేమమాలిని, శ్రేయ , తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ తదితరుల నటన , సంభాషణ కుదిరింది.  రాజ్యాధికారం చేపట్టగానే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసే శాతకర్ణి,   ముందు దక్షిణ భారతాన్ని గెలిచి.. ఆపై ఉత్తర భారతంపైకి దండెత్తుతాడు. ఈ క్రమంలో తన కొడుకు ప్రాణాలకే ముప్పు వాటిల్లినా.. తన భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా సరే ఏమాత్రం  వెనక్కి తగ్గడు. మొత్తం దేశాన్ని వశం చేసుకున్నాక పరాయి దేశస్థుల నుంచి శాతకర్ణికి సవాలు ఎదురవుతుంది. మరి ఈ సవాలును శాతకర్ణి ఎలా ఛేదించాడు. రణరంగంలో ఎలా విజేతగా నిలిచాడన్నది వెండితెరపై చూడాల్సిందే. 
పదునైన సంభాషణలతో .. బలమైన కధనంతో …
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆరంభ సన్నివేశంలో  తన పరాక్రమాన్ని గౌరవించి రాజ్యాన్ని అప్పగించమంటూ శాతకర్ణి పంపిన వర్తమానాన్ని అవతలి రాజుకు అందిస్తాడు దూత. అవతలి రాజుకు పౌరుషం వస్తుంది. దూతను ఉద్దేశించి ‘‘నిన్ను బంధిస్తే’’ అంటాడు అవతలి రాజు. ‘‘వారొస్తారు. నేను కారాగారంలో ఎదురు చూస్తుంటా’’ అని దూత బదులిస్తాడు . వెంటనే ‘‘నిన్ను వధిస్తే’’ అంటూ రెట్టించి అడుగుతాడు అవతలి రాజు. ‘‘మీరొస్తారు. నేను కాటికాడ ఎదురు చూస్తుంటా’’ అని  దూత అంటాడు. ఈ సంభాషణతో‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రేంజ్ రుచి చూపించాడు దర్శకుడు క్రిష్.  సిన్సియర్ గా ఈ కథను తెరకెక్కించాడు క్రిష్. శాతకర్ణి పాత్రకు తాను తప్ప ఇంకెవరూ ఊహలోకి కూడా రాని స్థాయిలో బాలకృష్ణ  అభినయం ప్రదర్శించాడు. 
      ఇక ఈ సినిమా నిడివి కూడా ఎక్కువ లేదు. పైగా తక్కువ కాలంలోనే తీసాడు.  గొప్ప చరిత్ర.. నేపథ్యం ఉన్న శాతకర్ణి కథను రెండుం పావు గంటల్లో క్రిష్ ఎలా చెప్పాడా అని సందేహం కలగొచ్చు.  2 గంటల 15 నిమిషాల నిడివిలో చాలా వరకు యుద్ధాలే కనిపిస్తాయి. సినిమా చూశాక పోరాట దృశ్యాలే కళ్లముందు కదలాడుతాయి. ఐతే శాతకర్ణి కథ అనగానే పుట్టుక.. బాల్యం.. యవ్వనం.. రాజుగా ఆధిపత్యం.. చరమాంకం అంటూ చాలా అధ్యాయాలు చూపించే ప్రయత్నం చేయకుండా కేవలం అతడి లక్ష్యం.. ఆ దిశగా పోరాటం.. ఈ నేపథ్యంలోనే దర్శకుడు తన  కథను నడిపించాడు. నేరుగా దక్షిణ భారతాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునే ఘట్టంతోనే శాతకర్ణి పరిచయ దృశ్యాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత మొత్తం భారతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడం.. చివరగా పరదేశీయులతో పోరాడి గెలవడంతో కథ ముగిసిపోతుంది. ఈ మధ్యలో సొంత కొడుకునే రణరంగంలోకి తీసుకెళ్లడం.. భార్యే శాతకర్ణితో తీవ్రంగా విభేదించడం.. ఈ నేపథ్యంలో భావోద్వేగాల నడుమ కథ నడుస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం కూడా శాతకర్ణి లక్ష్యంతో ముడిపడే ఉంటాయి. దాన్నుంచి క్రిష్ ఎక్కడా పట్టు తప్పలేదు. 
   యుద్ధంలో తన చేతిలో ఓడిపోయాక శత్రు రాజు వచ్చి తల వంచుతాడు. వెంటనే శాతకర్ణి.. ‘‘తల వంచకు. అది నేను గెలిచిన తల’’ అంటాడు. ఇంతకంటే రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశం ఏముంటుంది? ప్రమాణాల పరంగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఉన్నతమైన స్థానంలోనే ఉంటుంది కానీ.. ఇప్పుడిప్పుడే అభిరుచి మార్చుకుంటున్న సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న సందేహాలూ లేకపోలేదు. కమర్షియల్ గా ఇది ఏ స్థాయి విజయం సాధిస్తుందో చెప్పలేం. చరిత్రను ఉన్నదున్నట్లు చూపించాడా.. వక్రీకరించాడా అన్నది చరిత్ర కారులు తేల్చాలి. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చూశాక మాత్రం శాతకర్ణి గొప్పగా అనిపిస్తాడు. అందుకే  కచ్చితంగా ఇది తెలుగువారు గర్వించదగ్గ చిత్రమే.
నటనాపరంగా  
    శాతకర్ణిగా బాలయ్య అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన వాచకం.. హావభావాలతో శాతకర్ణి పాత్రను గొప్పగా పండించాడు బాలయ్య. ఆయన కెరీర్లో ఇది ది బెస్ట్ పెర్ఫామెన్స్ అని  చెప్పేయొచ్చు. సాయిమాధవ్ బుర్రా మాటల్ని పలికిన విధానానికి బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సినిమాలో మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారు. హేమమాలిని.. శ్రియలకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా ఉన్నంతసేపూ సినిమా స్థాయికి తగ్గట్లుగా గొప్పగా నటించారు. భర్త కోసం కొడుకును కోల్పోతానేమో అన్న సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో శ్రియ నటన కట్టిపడేస్తుంది. హేమమాలిని కూడా పాత్ర స్థాయికి తగ్గట్లుగా నటించింది. కబీర్ బేడికి పెద్దగా అవకాశం దక్కలేదు. మిలింద్ గుణాజీ ఆకట్టుకున్నాడు. మిగిలిన నటులు బానే నటించారు.  సాయిమాధవ్ బుర్రా తన కలం పదునేంటో చూపించాడు. ‘‘కాలం చేసైనా కాలాన్ని కందాం’’ ‘ ‘ఖనిజం అబద్ధం చెప్పదు’ వంటి డైలాగులు పేలాయి. ‘ ప్రతి ఇంటికీ గదులుంటాయి. గది గదికీ గొడవలుంటాయి. కానీ ఎవరైనా ఇంటిమీదికి వస్తే’ అంటూ భారత దేశ సమైక్యతను చాటిచెప్పే  డైలాగ్ చాలు. 
  కాగా ఈ సినిమా రాజమండ్రి అశోక తో పాటు పలు థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు అశోక సెకండ్ షో సాయంత్రం5.30 గంటలకు వేశారు.    టీడీపీ నాయకులు శ్రీ గన్ని కృష్ణ, డిప్యూటీ మేయర్ శ్రీ వాసిరెడ్డి రాంబాబు తదితరులు వీక్షించారు. 
   

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.