గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల అరెస్టు

kesu

ఇటీవల రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డ నలుగురు నిందితులను అర్బన్‌ జిల్లా పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ కేసును అర్బన్‌ జిల్లా పోలీసులు సవాలుగా తీసుకుని నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలను నియమించి చాకచక్యంగా అరెస్టు చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ శ్రీ ఆర్‌. గంగాధరరావు డిఎస్పీ కులశేఖర్‌, వన్‌ టౌన్‌ సి.ఐ. రవీంద్ర తదితరులతో కల్సి ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 16 వ తేదీన రాత్రి 11-30 గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి వెళుతుండగా దానవాయిపేట టిటిడి కల్యాణ మండపం వద్ద రాజేంద్రనగర్‌కు చెందిన రౌడీ షీటర్లు కక్కల సతీష్‌, తాడేపల్లి ప్రేమ్‌కుమార్‌, పాత నేరస్తులు పలివెల రాజు, కంచి సత్య మణికంఠలు వారిని అడ్డగించి బాధితురాలును బలవంతంగా స్కూటర్‌పై ఎక్కించుకుని దివాన్‌చెరువు సమీపాన శ్రీరాంపురంలోని కవలగొయ్యి వెళ్ళే మార్గంలో ఆమెను కొట్టి భయభ్రాంతురాలిని చేసి ఆమెపై నలుగురు నిందితులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని ఇంటి వద్ద దింపుతామని చెప్పి స్కూటర్‌పై ఎక్కించుకుని నందం గనిరాజు జంక్షన్‌ వద్దకు వచ్చే సరికి కంబాల చెరువు సెంటర్‌ నుంచి వస్తున్న లారీ వెనుక చక్రం తగిలి నిందితుల మధ్య కూర్చుని ఉన్న బాధితురాలు కింద పడటంతో ఆమె కుడి చేయికు తీవ్ర గాయమైంది. దీంతో నిందితులు, లారీ డ్రైవర్‌ కలిసి ఆమెను విఎల్‌పురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చి, గుట్టు చప్పుడు కాకుండా చేక్కేసారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు అర్బన్‌ జిల్లా ఎస్పీ హరికృష్ణ పర్యవేక్షణలో సెంట్రల్‌ జోన్‌ డిఎస్పీ జె.కులశేఖర్‌, సిబ్బంది కలిసి పరార యిన నిందితులకోసం గాలించి, నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో కక్కల సతీష్‌పై 16 కేసులు, ప్రేమ్‌కుమార్‌పై 30 కేసులు గతంలో నమోదయి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డ్స్‌ అందిస్తామని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. జోనల్‌ స్థాయిలో రౌడీ షీటర్లకు సత్ప్రవర్తన గురించి  కౌన్సిలింగ్‌ ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.