చాంబర్ ఎన్నికలకు సర్వం సిద్ధం

గెలుపు ఎవరిని వరిస్తుందో మరి
ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలకు కీలక ఘట్టం రానే వచ్చింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటలవరకు నిర్వహించే పోలింగ్ కి మెయిన్‌రోడ్‌లోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 2వేల 205మంది చాంబర్ ఓటర్లు వున్నారు. ఒక అధ్యక్ష స్థానానికి , రెండు ఉపాధ్యక్ష పదవులకు , ఒక గౌరవ కార్యదర్శి , ఒక సంయుక్త గౌరవ కార్యదర్శి , ఒక కోశాధికారి , 15డైరెక్టర్ పదవులు , మూడు ట్రస్ట్ బోర్డ్ డైరక్టర్ పదవులకు మొత్తం 24పదవులకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈసారి రాజీ యత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. రెండు బెల్టులు మొహారించి పోటాపోటీగా ప్రచార పర్వం సాగించాయి. అయితే అధ్యక్ష స్థానానికి త్రిముఖ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో చాంబర్ ప్రస్తుత గౌరవ కార్యదర్శి శ్రీ బూర్లగడ్డ సుబ్బారాయుడు – శ్రీ కాలెపు రామచంద్రరావు ప్యానెల్‌గా పోటీకి దిగితే , గత ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడిన శ్రీ మద్దుల మురళీకృష్ణ శ్రీ బలభద్ర రాజా(కృష్ణా మెడికల్స్ ) తదితరులతో కల్సి మరో ప్యానెల్‌గా బరిలోకి దిగారు. అధ్యక్ష స్థానానికి మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ లక్ష్మీనారాయణ జవ్వార్‌ కూడా పోటీలో వుండడం తో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చాంబర్ మాజీ అధ్యక్షులు అంతా కల్సి శ్రీ బూర్లగడ్డ – శ్రీ కాలెపు బెల్ట్ కి మద్దత్తు ఇవ్వగా, శ్రీ మద్దుల మురళీకృష్ణ, శ్రీ బలభద్ర రాజా ప్యానెల్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వాణిజ్య విభాగం నాయకులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్‌ శ్రీ బెజవాడ రాజకుమార్ కూడా బరిలో నిలిచారు.
శ్రీ బూర్లగడ్డ సుబ్బా రాయుడు, శ్రీ కాలెపు రామచంద్రరావు టీం కి చాంబర్‌ మాజీ అధ్యక్షులు సర్వశ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, బాలనాగు బలేష్‌గుప్తా, పొలసానపల్లి హనుమంతరావు, బొమ్మన రాజ్‌కుమార్‌, పోకల సీతయ్య, కొల్లేపల్లి శేషయ్య, దొండపాటి శంకర్రావు, నందెపు శ్రీనివాస్‌, అశోక్‌కుమార్‌ జైన్‌లు అండగా నిలిచి ప్రచారం సాగించారు. శ్రీ మద్దుల మురళీకృష్ణ టీం కూడా వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. ఇక ఎటువంటి ప్యానెల్‌ లేకుండా ఒంట రి గా అధ్యక్ష స్థానానికి బరిలోకి దిగిన శ్రీ లక్ష్మీనారాయణ జవ్వార్‌ కూడా చాపకింద నీరులా ప్రచారం సాగించారు.
తెలుగుదేశం బలపరించిన శ్రీ మద్దుల టీం లోని సభ్యులు సోషల్ మీడియా , వాయిస్ మెయిల్ ద్వారా ప్రచారం సాగించి , ప్రచార పర్వాన్ని కొత్తపుంతలు తొక్కించారు. సామాజిక సమీకరణాలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు. రెండు ప్రధాన టీం లలోని అధ్యక్ష అభ్యర్ధులు ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ , కీలకమైన బట్టల వర్తకం , మందుల వర్తకం , ఐరన్ అండ్ హార్డ్ వేర్ , శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ ఇలా కొన్ని కీలక విభాగాల వర్తకులు అనుసరించే విధానం మీద ఈ ఎన్నికల్లో తీర్పుని ప్రభావితం చేస్తాయి. ఎవరికి వారే గెలుపు ధీమాతో వుండగా, ఒంటరిగా బరిలో ఉన్న శ్రీ జవ్వార్ కూడా కీలకం కాబోతున్నారు. ఈయనకు వచ్చే ఓట్లు ఈయనను విజయ పదాన నిలుపుతాయో , ఎవరి గెలుపునైనా నిలువరిస్తాయో మరి . ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
వర్తక సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన చాంబర్ జట్టుకూలీల తో ఒప్పందం విషయం తదితర అంశాలు పరిష్కరిస్తూ , వర్తకులకు ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ వస్తోంది. అంతేకాదు ఎంట్రీ టాక్స్ , టర్నోవర్ టాక్స్ , మెడ్ అప్ టాక్స్ , వస్రాలపై వ్యాట్ విధింపు వంటి వాటిపై పోరాటం సల్పి, యావత్ రాష్ట్ర వర్తకలోకానికి మార్గ దర్శ కంగా నిలిచిన రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ఈసారి ఎవరి సారధ్యంలోకి వెళుతుందో , వర్తకులు ఎవరికీ పట్టం కడతారో …..

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.