చాంబర్ లో పోటీ అనివార్యమేనా ?

 మోహరించిన టీం లు – మూడు నామినేషన్లు తిరస్కృతి

ప్రతిష్టాత్మకమైన చాంబర్‌ ఆఫ్ కామర్స్ కి ఈసారి ఎన్నికలు తప్పేట్టు లేదు. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం   105 నామినేషన్‌లు దాఖలయ్యాయి. మంగళవారం  సాయంత్రం ఏడు గంటలకు గడువు ముగిసే సమయానికి పోటీదారులు తమ తమ  మద్దతుదారులతో  కల్సి  నామినేషన్‌లను దాఖలు  చేశారు. అధ్యక్ష స్థానానికి ఆరుగురు, ఉపాధ్యక్ష స్థానాలకు 13 మంది, కార్యదర్శి స్థానానికి ఆరుగురు, సంయుక్త కార్యదర్శి స్థానాలకు 11 మంది, కోశాధికారి స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. డైరెక్టర్ల స్థానాలకు 51 మంది, ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్ల స్థానాలకు 12 మంది నామినేషన్లు వేశారు. బుధవారం  సాయంత్రం 7 గంటల వరకు నామినేషన్‌ల పరిశీలన (స్కూ ృట్నీ) చేసారు. మూడు నామినేషన్లు తిరస్కరించారు.   శుక్రవారం (25) సాయంత్రం 7 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో బెల్టులు కట్టే పనిలో నిమగ్నమవుతూ , మరోపక్క ప్రచార పర్వానికి కూడా అభ్యర్ధులు దిగారు. ప్రస్తుత పాలక వర్గాన్నే కొనసాగించాలని మాజీ అధ్యక్షులంతా ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసినప్పటికీ, అధ్యక్షుడు శ్రీ అశోక్ కుమార్ జైన్ అయిష్టత చూపడం , మరోపక్క కొందరు పోటీకి సై అంటూ రావడంతో  పోటీ తప్పని పరిస్థితి నెలకొంది. ఉపసంహరణ ఘట్టం నాటికి రాజీ ప్రయత్నాలు జోరండుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కుదరని పక్షంలో    30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. కాగా నామినేషన్‌లు దాఖలు చేసిన వారి వివరాలు చాంబర్‌ ఎన్నికల అధికారి శ్రీ  మారిశెట్టి వెంకట రామారావు తెలియజేసిన ప్రకారం ఇలా ఉన్నాయి.

అధ్యక్ష స్థానానికి కోసూరి సుబ్బరావు, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మద్దుల మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ జవ్వార్‌, గ్రంధి వెంకటేశ్వరరావు, కురగంటి సతీష్‌ నామినేషన్‌లు వేశారు. ఉపాధ్యక్ష స్థానాలకు కోసూరి సుబ్బరాజు, దేశిరెడ్డి బలరామనాయుడు, వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం (బాబ్జి), గ్రంధి వెంకటేశ్వరరావు, మద్దాల రవిశంకర్‌, తవ్వా సూర్యనారాయణమూర్తి (తవ్వా రాజా), దొండపాటి సత్యంబాబు, మద్ది వీర వెంకట సత్యనారాయణమూర్తి, బి.వెంకట్రాజు (కృష్ణా మెడికల్‌ రాజా), రొబ్బి విజయశేఖర్‌, దేవత సుధాకర్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, యర్రా వేణుగోపాలరాయుడు నామినేషన్‌లు దాఖలు చేశారు. గౌరవ కార్యదర్శి స్థానానికి కాలెపు రామచంద్రరావు, మద్ది వీర వెంకట సత్యనారాయణమూర్తి, రొబ్బి విజయశేఖర్‌, వంకాయల శ్రీనివాసరావు, బి.వెంకట్రాజు (కృ ష్ణా మెడికల్‌ రాజా), యర్రా వేణుగోపాలరాయుడు నామినేషన్‌లు దాఖలు చేశారు. సంయుక్త కార్యదర్శి స్థానాలకు వెత్సా వెంకట సుబ్రహ్మణ్యం (బాబ్జి), దాసరి బ్రహ్మ గిరీష్‌, దేవత సుధాకర్‌, కనకాల రాజా, మజ్జి రాంబాబు, అశ్విన్‌కుమార్‌ జవ్వార్‌, సత్యవరపు సత్యనారాయణమూర్తి, దొండపాటి సత్యంబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, వెత్సా వెంకటేశ్వరరావు, మండవిల్లి శివన్నారాయణ (శివ) నామినేషన్‌లు వేశారు. కోశాధికారి స్థానానికి క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, మండవిల్లి వెంకట్రాజు (రాజా), దొండపాటి సత్యంబాబు, కొత్త బాలమురళీకృష్ణ, నల్లమిల్లి వీర బ్రహ్మానందరావు, పిన్నింటి రవిశంకర్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. డైరెక్టర్‌ల స్థానాలకు లక్కోజు వీరభద్రరావు (లక్కోజి), ఆకుల లోవరాజు, జొన్నాదుల రమేష్‌బాబు, దాసరి బ్రహ్మ గిరీష్‌, కనకాల రాజా, వలవల దుర్గాప్రసాద్‌, తోట లక్ష్మీనారాయణ (కన్నా), చించినాడ యల్లేశ్వరరావు (తాతాజీ), మద్దు సతీష్‌, పురోహిత్‌ హనుమాన్‌సింగ్‌, నల్లమిల్లి సత్యనారాయణ, మద్ది నారాయణరావు (ఎం.ఎన్‌.రావు), బెజవాడ రాజ్‌కుమార్‌, గోకవరపు సూర్య వెంకట సోమరాజు (రాజా), కాశి నవీన్‌కుమార్‌, శింగంశెట్టి సత్యనారాయణమూర్తి, తమ్మన గోపాలకృష్ణ, మజ్జి రాంబాబు, తమ్మన సుబ్బారావు, యక్కల వీర నాగేశ్వరరావు, పచ్చిగోళ్ళ వెంకట సూర్యనారాయణ, చిట్టూరి సీతారామరాజు, పుచ్చల రామకృష్ణ, షేక్‌ చాన్‌ భాషా, కొత్త బాల మురళీకృష్ణ, వేమన సురేష్‌కుమార్‌, అల్లంకి నాగేశ్వరరావు, మామిడి వెంకట్రాజు, కుడిపూడి వెంకటప్రసాద్‌, సత్యవరపు సత్యనారాయణమూర్తి, దొండపాటి ప్రవీణ్‌కుమార్‌ ఖండవల్లి అర్జున్‌, క్రొవ్విడి సాయికుమార్‌, పొట్లూరి రామ్మోహనరావు, షేక్‌ అబ్దుల్‌ కరీమ్‌, ఆకుల దుర్గా రఘుకుమార్‌, ఒబిలిశెట్టి వెంకటరమణమూర్తి, మండవిల్లి నాగ వెంకట సత్య మురళీకృష్ణ (నానాజీ), యర్రా గురుదేవులు, పొలసానపల్లి జగ్గారావు, తవ్వా సూర్యనారాయణమూర్తి (తవ్వా రాజా), యస్‌.అనంతరామ్‌, సింహాద్రి రంగనాయకులు, మహ్మద్‌ అబ్దుల్‌ ఫహీమ్‌, సత్తి మూలారెడ్డి, గ్రంధి సత్య గోపాలకృష్ణ, పెరుమాళ్ళ శ్రీ భగవాను (భగవాన్‌ పెరుమాళ్ళ), ఆకుల సాయిబాబు, రామేన కేశవరావు, రావిపాటి మదన గోపాలస్వామి, నటరాజ రాజేంద్రన్‌ మురుగేషన్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. ట్రస్ట్‌బోర్డు డైరెక్టర్ల స్థానాలకు కంచర్ల వెంకట శివ సుబ్రహ్మణ్య సత్యానంద రామారావు (రాజాపండు), ఆకుల సాయి త్రినాధ్‌, బత్తుల శ్రీరాములు (బిఎస్‌ఆర్‌), అశ్విన్‌కుమార్‌ జవ్వార్‌, వేమన సురేష్‌కుమార్‌, అల్లంకి నాగేశ్వరరావు, కొత్త బాలమురళీకృష్ణ, జె.యమ్‌.వి.పార్ధసారధి (ఎల్‌ఐసి పార్ధ సారధి), చవ్వాకుల రంగనాధ్‌, మండవిల్లి శివన్నారాయణ (శివ), మట్టే కాళీకృష్ణ, నల్లమిల్లి వీరబ్రహ్మానందరావు నామినేషన్‌లు వేశారు.

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.