జగన్‌ వస్తేనే వైఎస్‌ స్వర్ణయుగ పాలన సాధ్యం – అదే మన ధ్యేయం  కావాలి 

వైస్సార్ సిపి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ
ప్లీనరీలో భూమన కరుణాకరరెడ్డి పిలుపు

pleenaripleenari.jpg2
” ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ సీఎం అయితేనే డాక్టర్ వై.ఎస్‌.సువర్ణ పాలన సాధ్యమవుతుంది. అందుకే వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు పార్టీ శ్రేణులు విశ్రమించరాదు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి  స్వర్ణయుగ  పాలన తిరిగి తీసుకు రావడమే మనందరి లక్ష్యం కావాలి, ఆయన ఆశయాలను, ఆలోచనలను అమలు చేయడమే మనపార్టీ లక్ష్యం” అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిటిడి బోర్డు మాజీ చైర్మన్‌ శ్రీ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. నియోజక వర్గాల వారీగా జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశామలో భాగంగా మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, యువకులు హాజరైన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిధిగా భూమన కరుణాకరరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, కార్యకర్తల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్న వై.ఎస్‌.జగన్‌ ఆలోచనే ఈ ప్లీనరీ సమావేశాలని చెప్పారు. తమ ప్రాంతంలో లభ్యమవుతున్న గ్యాస్‌ నిక్షేపాలను ఈ ప్రాంత వాసులే వినియోగించుకోవాలని నినదించిన ఇద్దరు దేశాధినేతలు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారని, ఆ తరువాత విచారణలో అవి హత్యగా నిరూపించబడ్డాయని, ఆతర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ గ్యాస్‌ నిక్షేపాలపై పోరాడిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రపంచంలో మూడవ వ్యక్తి గా నిలిచారని శ్రీ భూమన చెబుతూ అందుకే డాక్టర్ వైఎస్ మరణంపై కూడా అందరిలో సందేహం నెలకొందన్నారు. అందరి శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అని, ఆయన ఆకస్మిక మరణంతో ఆయన పథకాలకు తూట్లు పొడుస్తూ, ఆశయాలను నీరుగారుస్తున్న తరుణంలో నేనున్నానంటూ వై.ఎస్‌.జగన్‌ ముందుకు వచ్చారని చెప్పారు. అయితే సోనియాగాంధీ, చంద్రబాబు కుట్రలు పన్ని జగన్ పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, నిందలు మోపినా, మొక్కవోని దీక్షతో ప్రజల శ్రేయస్సు కోసం జగన్‌ నిత్యం పోరాటాలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని ఆయన చెప్పారు. అనైతిక పొత్తులు, అబద్ధపు హామీలు ఇచ్చినప్పటికీ కేవలం ఐదు లక్షల 75వేల ఓట్ల తేడాతో మాత్రమే శ్రీ చంద్రబాబు నెగ్గారని ఆయన పేర్కొన్నారు. 67సీట్లతో విజయం సాధించిన వ్యక్తిగా దేశంలో అందరి దృష్టిని జగన్ ఆకర్షించారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అభివృద్ధికి, పెట్టుబడులకు తానే బ్రాండ్‌ అని చంద్రబాబు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. వాస్తవానికి అవినీతి, అరాచకాలకు, అక్రమాలకు బ్రాండ్‌ చంద్రబాబని ఆయన ఎద్దేవా చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు ఫుడ్‌ ఫెస్టివల్‌లా వుందే తప్ప, ఒక్క ప్రజా సమస్య చర్చకు రాలేదని, చంద్రబాబుకు భజన, జగన్‌పై విమర్శలు తప్ప ఏ అంశం తమ దృష్టికి కనిపించక పోవడం వింతగా ఉందని అన్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ అక్షరాభ్యాస కార్యక్రమంలో అ అంటే అమరావతి,ఆ అంటే ఆదాయం అని చంద్రబాబు చెప్పకనే చెప్పారని, అమరావతి ద్వారా ఆదాయాన్ని పొందడమే వారి ముందున్న లక్ష్యమని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి శ్రీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు.
పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ ద్వారా నెగ్గి, పదవులు పొంది ,పార్టీలు ఫిరాయించేవారిని నమ్మకూడదన్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే, ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మరింత బలపడిందన్నారు. ఈ ప్రభుత్వానికి అవినీతి, దోపిడీలు, బలవంతపు భూసేకరణలు తప్ప అభివృద్ధి సాధ్యం కాదని, పురుషోత్తపట్నం పథకంలో రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. గత పాలకుల హయాంలో కట్టిన ఇళ్ళపై గురి పెట్టి అర్హులను అనర్హులుగా చూపే దుష్ట రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, వారే భూమిని సేకరించి గృహాలు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చి సత్తా నిరూపించుకోవాలని ఆమె సవాల్ చేసారు. శ్రీ రౌతు మాట్లాడుతూ జగన్‌ను సీఎం చేయడమే తమ ముందున్న లక్ష్యమని, ఆ దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు. అవినీతి, అరాచక పాలనపై మడమతిప్పని పోరాటం చేస్తున్న జగన్‌కు అందరూ అండగా నిలవాలన్నారు.
సిటీ నియోజకవర్గానికి రౌతే అభ్యర్ధి : దుర్గేష్
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిటీ నియోజకవర్గానికి రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేయబోతున్నారని, ఆయనను మూడవసారి కూడా ఆశీర్వదించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కందుల దుర్గేష్‌ అన్నారు. సిటీ నియోజకవర్గ ప్లీనరీలో శ్రీ కందుల దుర్గేష్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచాయి. దీంతో కేరింతలు కొట్టారు. పదేళ్ళపాటు రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీ రౌతు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, వేలాది గృహాలు నిర్మించారన్నారు. ఇందుకోసం ఫైళ్లు పట్టుకుని ఎలా తిరిగారో ప్రత్యక్షంగా తానూ చూశానని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం పరితపించే శ్రీ రౌతును నగర ప్రజలు మరోసారి ఆదరించి విజయం అందించాలని ఆయన కోరారు వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎన్నికలెప్పుడైనా పార్టీ అభ్యర్ధుల విజయానికి అందరూ కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల పార్టీ నాయకులు పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, శ్రీమతి పోలు విజయలక్ష్మి , రావూరి వెంకటేశ్వరరావుతదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, గెడ్డం రమణ, గుత్తుల మురళీధరరావు, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, భీమవరపు వెంకటేశ్వరరావు, కానుబోయిన సాగర్, కుక్కల తాతబ్బాయి, ముప్పన శ్రీను, మార్తి లక్ష్మి,మస్కా రామజోగి, మజ్జి అప్పారావు, ముత్యాల పెదబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.