జగన్‌ వ్యాఖ్యలపై టిడిపి శ్రేణుల మండిపాటు .. jagan Scarecrow Dagdam

మతిభ్రమించిన జగన్ని పిచ్చాసుపత్రికి పంపాలి : గోరంట్ల

dagdamdagdam2
 చంద్రబాబుని చెప్పుతో కొట్టాలంటూ వైసిపి నేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు మందిపతున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా  రాజమహేంద్రవరం  కోటగుమ్మం సెంటర్‌లో జగన్‌ దిష్టిబొమ్మను శనివారం ఉదయం దగ్ధం చేశారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి,  మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, చీప్‌ విప్‌ పాలిక శ్రీను, జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, కొమ్మ శ్రీనివాసరావు, రెడ్డి పార్వతి,, ద్వారా పార్వతి సుందరి, గొందశి మాధవీలత, గరగ పార్వతి, కంటిపూడి పద్మావతి, కోసూరి చండీప్రియ, పెనుగొండ విజయభారతి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కరగాని మాధవి, మజ్జి మౌనిక, పల్లి శ్రీను, బూర దుర్గాంజనేయరావు, పాలవలస వీరభద్రం, సింహ నాగమణి, కోరుమిల్లి విజయశేఖర్‌, కళింగ సూర్యనారాయణ, తలారి ఉమాదేవి, పైడిమళ్ళ మెర్సీప్రియ, కో-ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, చాన్‌ భాషా, కప్పల వెలుగు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, అరిగెల బాబు, రొబ్బి విజయశేఖర్‌, శెట్టి జగదీష్‌, హబీబుల్లాఖాన్‌, యార్లగడ్డ శేఖర్‌, బొచ్చా శ్రీను, ఎస్‌.రాజారావు, ప్రవీణ్‌చౌదరి, మళ్ళ వెంకట్రాజు, నిమ్మలపూడి గోవింద్‌, చించినాడ తాతాజీ, తవ్వా రాజా, కరగాని వేణు, విశ్వనాధరాజు, కర్రి రాంబాబు, మజ్జి సోమేశ్వరరావు, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, కానుమిల్లి వెంకన్న దొర, మరుకుర్తి దుర్గా యాదవ్‌, పెనుగొండ రామకృష్ణ, తంగేటి సాయి, రేయి అప్పన్న, మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధార్థ, చంద్రశేఖర్‌నాయుడు, బిక్కిన రవికిషోర్‌, పితాని కుటుంబరావు, మత్స్యేటి ప్రసాద్‌, మార్ని వాసు, కురెడ్ల శేషుకుమార్‌ రెడ్డి, తీగ నరసింహమూర్తి, మాకాని లక్ష్మణరావు, వానపల్లి సాయిబాబా, శనివాడ అర్జున్‌, పిన్నింటి రవిశంకర్‌, దుర్యోధన మహంతి, అడ్డగర్ల ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. జగన్‌ చిత్రపటాన్ని తెలుగు మహిళలు చెప్పులతో కొట్టి నినాదాలు చేశారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేసారు.
ఈ సందర్భంగా శ్రీ గోరంట్ల మాట్లాడుతూ  నవ్యాంధ్ర నిర్మాణానికి అలుపెరగకుండా కృషిచేస్తూ, ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలపడానికి నవ్యాంధ్ర నిర్మాణ దీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్‌ చేస్తున్న విమర్శలు చేస్తుంటే,ఆయనకు మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నట్లు వుందని  పేర్కొంటూ, ఇకనైనా పిచ్చాసుపత్రికి పంపి చికిత్స అందించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  జగన్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్‌ వైఖరి, మాటతీరు సరిగా లేనందువల్లే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారని, దీంతో ఆయనకు మతిభ్రమించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతోమంది ప్రముఖులు ప్రతిపక్ష పాత్ర పోషించి హుందాతనంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిన జగన్‌లాంటి అవినీతిపరుడు ప్రతిపక్ష హోదాలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక హత్యాకాండల వెనుక జగన్‌ హస్తం ఉందని, అతనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిరోధకుడిగా నిలిచి, పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్న ఆంధ్రా ద్రోహి జగన్‌ను ప్రజలు తరిమికొడతారన్నారు. తెలుగు తమ్ముళ్ళు తలుచుకుంటే పులివెందుల నుంచి బెంగళూరు వరకు పరిగెట్టిస్తారని హెచ్చరించారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం అంత వయసు జగన్‌కు లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాడన్నారు.

http://YS Jagan faces criticism | Mirchi Vilas,

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.