జూన్ 2న మహా సంకల్ప దీక్ష … Lord will strike on June 2

పుష్కర్ ఘాట్ కి తరలిరావాలి : గోరంట్ల

gorantla
జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా మహాసంకల్పం కార్యక్రమాన్ని చేపడుతున్న నేపధ్యంలో పుష్కరఘాట్‌ వద్ద కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమానికి అందరూ విచ్చేయాలని రూరల్‌ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, హోదా ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీకే తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తించి మహానాడులో తీర్మానం చేశామని, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. సుహృద్భావ వాతావరణంలో ఎలాంటి ఘర్షణ వైఖరి లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను రాబట్టేందుకు ఆవేదన వినిపిస్తున్నామని ఆయన పేర్కొంటూ, సంద్రింపులతో వాటిని సాధిస్తామన్నారు. గతంలో రాజ్యసభ స్ధానాన్ని నిర్మలా సీతారామన్‌కు ఇచ్చామని ఇపుడు రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకి ఇవ్వాలని బిజెపి అధ్యక్షులు అమిత్‌ షా కోరడంతో చంద్రబాబు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని, కేంద్రం నుంచి వస్తున్న ప్రతి గ్రాంట్‌ను సద్వినియోగపరుస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన విభజన నష్టాన్ని పూరించే విషయంలో అశ్రద్ధ చేయెద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=gorantla%20buchaiah%20chowdary

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=amaravathi

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.