డబ్బుల కోసం ఎత్తిపోతల పధకాలు – పోలవరం అటకెక్కించారు

సీఎం చంద్రబాబుతీరుని ఎండగట్టిన కందుల దుర్గేష్‌
durgeshఅందరికీ ఉపయోగమైన పోలవరం ప్రాజెక్ట్ ఊసెత్తకుండా కేవలం ఎత్తిపోతల పథకాల పేరుతో సీఎం చంద్రబాబునాయుడు డబ్బులు తోడుకునే ప్రయత్నం చేస్తున్నారని తద్వారా జీవనాడిగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న పోలవరం ప్రాజక్ట్‌ను అటకెక్కించారని శాసనమండలి మాజీ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీ కందుల దుర్గేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజానికి 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రజలను నమ్మించి నిలువునా మోసగించారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ కి 40వేల కోట్ల రూపాయల అంచనాకు పెరిగిందని అయితే కేంద్రం ఇక 8వేల కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పేసిందని ఆయన పేర్కొంటూ, సీఎం గానీ ఎంపీలు గానీ దీనిపై నోరు మెదపక పోవడం దారుణమని విమర్శించారు. తన నివాసంలో గురువారం ఉదయం వెలుగుబంటి అచ్యుతం, చిక్కాల బాబులు, పేట కామరాజు, మేడి త్రిమూర్తులు, బొప్పన నరేంద్ర,రామకృష్ణ తదితరులతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఎత్తిపోతల పేరిట నీళ్లు కాకుండా డబ్బులు తోడుకునే కుట్రల వల్ల గోదావరి డెల్టా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఊసే లేదని, రాజధాని నిర్మాణానికి నిధులు విడుదల చేయలేదని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు ప్రకటించలేదని అన్నారు.కేంద్రం చేయాల్సిన సహాయం చాలా ఉందని, ఇలాంటప్పుడు సీఎం చంద్రబాబు మౌనం దాల్చడం మంచిది కాదన్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా బిసీల, ముస్లిమ్‌లకు సబ్‌ ప్లాన్‌ అమలు చేయలేదని విమర్శించారు. నగదు రహిత సేవలంటూ ప్రచారం చేస్తున్న బిజెపి , టిడిపి నేతలు ఫించన్లపై దృష్టి సారించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామ ని ఆయన అన్నారు. క్యాష్ లెస్ లావాదేవీలు అంటున్నారని అయితే బ్యాంకులు, ఏటీఎం లు , ప్రజలు కేష్ లెస్ మారిన పరిస్థితి దాపురించిందని ఆయన ఎద్దేవా చేసారు. ఇక కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళను రోడ్డున పడేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=kandula%20durgesh

https://www.google.co.in/search?q=raghaveeyam&oq=ra&aqs=chrome.1.69i60j69i59j69i60l2j69i57j69i59.2235j0j7&sourceid=chrome&ie=UTF-8

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.