డాక్టర్ కర్రి రామారెడ్డికి బిసి రాయ్ అవార్డు

పలువురు వైద్యులు అభినందన

ramareddi

ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, సరస్వతీ పుత్రులు, మానస హాస్పటల్‌ అధినేత, నిత్య విద్యార్థి డా. కర్రి రామారెడ్డి ఎక్కువ డిగ్రీలు సాధించినందుకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇప్పటికే చోటు దక్కించుకోగా, వైద్య రంగంలో జాతీయ స్థాయిలో ఆస్కార్‌ లాంటి అత్యున్నత డా. బి.సి.రాయ్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 2014 సంవత్సరానికి ఈయనను ఎంపికచేశారు. ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి వర్తమానం అందింది. దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో విశిష్ఠ సేవలు చేసిన వ్యక్తులను సంవత్సరానికి ఐదారుగురిని ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేస్తారు. 2014, 2015 సంవత్సరాలకు ఎంపిక చేసిన డాక్టర్లకు ఈ అవార్డును బి. సి. రాయ్‌ జయంతి (డాక్టర్స్‌ డే) రోజైన 2017 జులై 1న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఈ సందర్బంగా మానస హాస్పిటల్ లో జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ఐ ఎం ఏ రాజమండ్రి అధ్యక్ష్యులు డాక్టర్ వేలూరి శ్రీరామచంద్ర, కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్, శ్రీ ఫణి నాగేశ్వరరావు, శ్రీ పివిఎస్ కృష్ణారావు లతో కల్సి ఆయన బుధవారం ఉద్యమ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసారు.
డాక్టర్ రామారెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో పలువురు ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ఫణి నాగేశ్వరరావు మాట్లాడుతూ దక్షిణ భారదేశంలో గర్వించ దగ్గ వైద్యులు డాక్టర్ రామారెడ్డి చరిత్రలో నిలిచిపోయే అరుదైన అవార్డుకి ఎంపికయ్యారని అన్నారు. డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ రాజమండ్రి వైద్యునికి దేశం గర్వించే అరుదైన బిసి రాయ్ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. డాక్టర్ వి రామచంద్ర మాట్లాడుతూ ఐ ఎం ఏ వ్యవస్థాపకులు , బెంగాల్ మాజీ సీఎం డాక్టర్ బిసి రాయ్ అవార్డు రావడం అంటే సామాన్య విషయం కాదన్నారు. డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ బిసి రాయ్ అవార్డు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ వస్తే, అందులో మన రాజమండ్రికి చెందిన డాక్టర్ రామారెడ్డి ఒకరు కావడం ఆనందంగా ఉందన్నారు.
డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ గన్ని భాస్కరరావు, డాక్టర్ గురుప్రసాద్ తదితరుల ప్రోత్సాహంతో బిసి రాయ్ అవార్డుకి నాలుగు సెట్ల నామినేషన్ పంపానని, అన్ని వివరాలు కలిపి 45కిలోల పేపర్లు పంపినట్లు ఆయన చెప్పారు. సోషియో మెడికల్ విభాగంలో ఈ అవార్డు ప్రకటించారని చెప్పారు. గతంలో పద్మశ్రీ పురస్కారానికి నామినేషన్ పంపానని అయితే అవార్డులు పురస్కారాలకు ఎదురు చూడకుండా తనపని తాను చేసుకు పోతున్నానని, ఈక్రమంలోనే ఈ అవార్డు వచ్చిందని వివరించారు. చదువుకి సంబంధించి పిహెచ్ డి మరో ఆరుమాసాల్లో పూర్తవ్వగలదని, ఎం ఎల్ ఐ సి, ఎం ఎస్ డబ్ల్యూ డిగ్రీలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా వైద్యులు డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ రామచంద్ర, డాక్టర్ గురుప్రసాద్ లను డాక్టర్ రామారెడ్డి సత్కరించుకున్నారు. ఎపియు డబ్ల్యూజే పక్షాన డాక్టర్ రామారెడ్డిని సీనియర్ పాత్రికేయులు శ్రీ జి ఏ భూషణ్ బాబు అభినందించారు. ఫేస్ బుక్ మిత్రులు శ్రీ బండ్ల శంకర్ ఈ సందర్బంగా డాక్టర్ రామారెడ్డికి చిత్రపటం అందించారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=dr%20karri%20rama%20reddy

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.