డాక్టర్ కర్రి రామారెడ్డి ‘మనలో  మనం’ పుస్తకావిష్కరణ 

      ra ramareddi
  rama
గతంలో ‘మనలో ఒకరు పుస్తకం’ అందించి విశేష ఆదరణ చూరగొన్న ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిత్య విద్యార్థి, డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి తాజాగా ‘మనలో మనం’ పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని కూడా సైకాలజీ టుడే ఎడిటర్  శ్రీ ఎస్ వి సురేష్ నేతృత్వంలోనే ముద్రితమైంది. మానసిక ఆరోగ్య చట్టం పార్లమెంటులో ఆమోదం పొందడం, వైద్యులు  కలగనే  డాక్టర్ బిసి రాయ్ అవార్డుని డాక్టర్ రామారెడ్డి స్వీకరించడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘మనలో మనం’ పుస్తకం మనముందుకు రావడం అభినందనీయమని ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ ఎస్ వి సురేష్ అన్నారు. రాజమహేందరవం దానవాయిపేట మానస హాస్పిటల్ పైన ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘మనలో మనం’ పుస్తకాన్ని శ్రీ సురేష్,శ్రీమతి పద్మజ దంపతులు ఆవిష్కరించారు. శ్రీ ఫణి నాగేశ్వరరావు స్వాగతం పలికి, పుస్తకాన్ని సమీక్షిస్తూ ఈ పుస్తకంలో ఎన్నో మంచి విషయాలున్నాయన్నారు. ఒక్కొక్కటి చదువుతుంటే, మనం , మన పరిసరాల లో నివసించే వ్యక్తుల చుట్టూ అల్లుకున్నట్లు ఉంటుందన్నారు, మనో గవాక్షం శీర్షిక గొప్ప ప్రయోగమన్నారు. విద్యాలోపాలను ఎత్తిచూపుతూ మంచి వ్యాసం అందించారని , ప్రతి శీర్షిక కధలా నడుస్తుందని వివరించారు.
   డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకూ  దాదాపు 3,500 ఆర్టికల్స్ ఆయా పత్రికలలో వచ్చాయని, రాజకీయాలు ,సామాజిక అంశాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. సమాచారమ్ స్థానిక దినపత్రిక,సాక్షి సాయంకాలం పత్రిక,సంధ్య సాయంకాలం పత్రిక, సరికొత్త సమాచారం వార పత్రిక లలో  రెగ్యులర్ శీర్షికలు నడుస్తున్నాయని, గతంలో సూర్య, వేదిక పత్రికలలో అలాగే వార్త దినపత్రికలో వ్యాసాలు వచ్చాయని , దక్కన్ క్రానికల్ లో మైండ్ మేటర్స్ పేరిట వ్యాసాలు వచ్చాయని వివరించారు. గతంలో మనిషి- మనసు’ పుస్తకాన్ని శ్రీ సివి సర్వేశ్వర శర్మ తో కల్సి రాశామని చెప్పారు. ఆతర్వాత మనలో ఒకరు పుస్తకం వచ్చిందని ఇప్పడు మనలో మనం పుస్తకం తీసుకొచ్చామని చెప్పారు. శ్రీ సురేష్ మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి ఎలాంటి సవరణలు, తప్పులు లేకుండా తనదైన శైలిలో డాక్టర్  రామారెడ్డి రచన సాగిందని చెప్పారు. ఈ పుస్తకంలో 33 శీర్షికలు ఉన్నాయని, ఇందులో ఎదో ఒక దాంట్లో మన ప్రవర్తన ఇమిడి  వుంటుందన్నారు. ఈ సందర్బంగా శ్రీ సురేష్ దంపతులను డాక్టార్ రామారెడ్డి దంపతులు శాలువాలతో  సత్కరించారు. శ్రీ పివిఎస్ కృష్ణారావు వందన సమర్పణ చేసారు. 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.