తిరంగ యాత్ర లో సమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారం … BJP’s ‘Tiranga Yatra

dattakasibhatlafredam parkpalakodetivaranasidr.kasibhatlays

భారతీయ జనతాపార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు లో భాగంగా ఆగస్టు 17న నగరంలో తిరంగ యాత్ర ఉత్సాహంగా సాగింది. నగరానికి వచ్చిన కేంద్ర కార్మిక శాఖా సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తిరంగ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ద్విచక్ర వాహనంపై అర్బన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్ములదత్తుతో కలిసి ఆయన కూడా పాల్గొన్నారు. కంబాలచెరువు వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దత్తాత్రేయ తిరంగ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, గరిమెళ్ళ చిట్టిబాబు, ధార్వాడ రామకృష్ణ, అడబాల రామకృష్ణ, మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, అడపా వరప్రసాద్‌, వానపల్లి శంకర్‌, పసలపూడి శ్రీనివాస్‌, కరుటూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. తిరంగ యాత్ర కోటిపల్లి బస్టాండ్‌లోని స్వాతంత్య్ర సమరయోధుల పార్కు వరకు సాగింది. ఈ సందర్భంగా పాల్ చౌక్ (కోటిపల్లి బస్టాండ్) ఫ్రీడమ్ పార్కులోని పార్కులోని స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు బండారు దత్తాత్రేయ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు చెందిన ప్రతినిధులను శ్రీ దత్తాత్రేయ చేతులమీదుగా సత్కరించారు. డాక్టర్ బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం మనవడు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం, శ్రీమతి కాశీభట్ల వెంకటరమణమ్మ మనవడు డాక్టర్ నరసింహారావు , పాలకోడేటి పద్మజ దంపతులను అలాగే ఫ్రీడమ్ పార్కులో మహిళా సమరయోధు రాండ్ర విగ్రహాలను పెట్టించిన శ్రీ వైఎస్ నరసింహారావు తదితరులు సత్కారం అందుకున్నారు.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=BJP%27s+%27Tiranga+Yatra

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=dr%2C%20kasibhatla%20narasimharao

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bandaru+dattatreya

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=somu%20veerraju

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.