తిరుమల బ్రహ్మోత్సవాలకు అన్నమయ్య పూలరథం

5 మధ్యాహ్నం లోగా పూలు, దండాలు సమర్పించాలి
ఏవి అప్పారావు రోడ్ నుంచి 5 న 3గంటలకు బయలుదేరనున్న రధం

annamayya-poola-radhamannamayya-poola-radham-jpg2
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఇక శ్రీవారికి తూర్పు గోదావరి నుంచి భక్తుల పక్షాన పూలు సమర్పించడానికి ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. గురు కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యాన గడిచిన 7ఏళ్లుగా ఇక్కడ నుంచి పూలరథం వెళుతోంది. ఈ ఏడాది కూడా ఇందుకోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్వీనర్ శ్రీ పివిఎస్ కృష్ణారావు, శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ ఎస్ పి గంగిరెడ్డి , మద్దాల అను , విజయలక్ష్మి సోమవారం ఉదయం రాజమహేంద్రవరం జాంపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈనెల 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3గంటలకు ఏవి అప్పారావు రోడ్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అన్నమయ్య పూలరథం బయలు దేరుతుందని శ్రీ కృష్ణారావు చెప్పారు. భక్తులు బంతి , చామంతి,లిల్లీ ,మరువం, దవనం,తులసి,వంటి పూలను మాత్రమే సమర్పించాలని, వీలైనంత మేరకు దండలుగా చేసి ఇవ్వాలని సూచించారు. ఒకవేళ విడిపూవులు ఇవ్వదలిస్తే,5వ తేదీ ఉదయం 9నుంచి12గంటల లోపు సమర్పించాలని, దండలైతే మధ్యాహ్నం 3గంటలల్లోగా ఇవ్వవచ్చని తెలిపారు. అలాగే విడి పూలను దండలుగా కట్టే కార్యక్రమంలో కూడా మహిళలు స్వచ్ఛందంగా పోల్గొనవచ్చని తెలిపారు.
శ్రీ గంగిరెడ్డి మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లుగా ఆదిత్య ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పూల సేకరణ, దండలుగా కట్టడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీవారి సేవలో పూలు సమర్పించడం అందరికీ సాధ్యం కాదని, అలాంటి వారికోసం ఈ బృహత్తర అవకాశం కొండవీటి జ్యోతిర్మయి కల్పించారని చెప్పారు. ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు అర్చకులు శ్రీ పి. నరసింహాచార్యులు 9440373722, శ్రీ పివిఎస్ కృష్ణారావు 9848706190 లను సంప్రదించాలి.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=annamayya%20poolaradham

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.