తురగా జానకీరాణి (రేడియో అక్కయ్య )

         06 రేడియో లో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా       అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఈమె ఆగస్టు 31, 1936 న జన్మించారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు… ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. బాలానందం కార్యక్రమమం ద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవారు. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశారు. బాలానందం ద్వారా ప్రముఖ కధా రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసారు. ముప్పై సంవత్సరాల కిందటే “ఇది నా సమస్య” అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవారువందకి పైగా కథలు రచించారు. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కథకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు.ఆ కథ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా…
                                                                                                             03                      

                                                                                                                                             భమిడిపాటి ఫణిబాబు

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.