తెలుగుదేశం కమిటీలలో తూర్పు గోదావరికి పెద్ద పీట

కేంద్రకమిటీ పోలిట్ బ్యూరోలో యనమల – రాజప్ప
ఎపి కమిటీ ప్రధాన కార్యదర్శులుగా బుచ్చయ్య చౌదరి – రెడ్డి సుబ్రహ్మణ్యం

ఉపాధ్యక్షులుగా డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు
కేంద్ర కమిటీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా ఎం ఎల్ సి . వివివి చౌదరి

yanamalarajappagorantla

metlavvvreddy

తెలుగుదేశం పార్టీ ఇటు ఎపి , అటు తెలంగాణా రాష్ట్రాల్లో పనిచేయడానికి జాతీయ పార్టీగా మారిన నేపధ్యంలో రెండు రాష్ట్రాలకు కమిటీలను కేంద్ర కమిటీ అధ్యక్షుడు , ఎపి సిఎమ్ శ్రీ చంద్రబాబు బుధవారం ఉదయం ప్రకటించారు. ఎపి విభాగానికి శ్రీ కళా వెంకట్రావు అధ్యక్షుడుగా వుంటారు. తెలంగాణా విభాగానికి శ్రీ ఎల్ రమణ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. కమిటీలలో తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద పీట వేసారు. కేంద్ర కమిటీలో 17మంది పోలిట్ బ్యూరో సభ్యులను నియమించారు. ఇందులో తూర్పు గోదావరి నుంచి మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు , శ్రీ నిమ్మకాయల చినరాజప్ప సభ్యులుగా నియమితులయ్యారు. కేంద్ర కమిటీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా ఎం ఎల్ సి శ్రీ వివివి చౌదరి నియమితులయ్యారు. ఎపి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులుగా సీనియర్ నేత , రాజమండ్రి రూరల్ ఎం ఎల్ ఎ శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి , ఎం ఎల్ సి శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. .రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా కోనసీమకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు నియమితులయ్యారు.  ఇప్పటివరకు వెల్లడైన ప్రకారం జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కగా , మరికొందరికి కూడా అవకాశం రావచ్చని చెప్పవచ్చు. ఇక పొలిటి బ్యూరోలో ఎక్స్ అఫీషియో సభ్యుడుగా శ్రీ నారా లేకేష్ నియమితులవ్వడమే కాక , కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి హోదా కూడా దక్కింది. 

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.