దీక్ష  హస్తినలో చేస్తే బాగుంటుందేమో 

జగన్‌కు ఉప ముఖ్యమంత్రి రాజప్ప  సలహా
 హోం మంత్రికి   విందు ఇచ్చిన  గన్ని కృష్ణ  

ganni2ganni

ప్రత్యేక హోదా కోసం వైస్సార్ సిపీ  అధినేత జగన్‌ నిరవధిక దీక్షను గుంటూరులో కాకుండా  ఢిల్లీలో చేస్తే బాగుంటుందేమోనని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అభిప్రాయపడ్డారు .  మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్ళే ముందు బుధవారం  ఉదయం రాజమండ్రి  శ్రీరామ్‌నగర్‌లోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీ  గన్ని కృష్ణ ఇంటికి వచ్చిన చిన ఈయన  తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ అభివృద్ధి నిరోధకుడిగా మారారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూములు సేకరిస్తుంటే జగన్‌ అడ్డుపడి ఆందోళన చేసినప్పటికి 33 వేల ఎకరాలను రైతులు స్వచ్చంధంగా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే పలు దఫాలు ప్రధాని శ్రీ నరేంద్ర  మోడీ, కేంద్ర మంత్రులను కలిశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే ఎన్నో సంస్ధలను, ప్రాజక్టులను సాధించిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని, దీనిపై కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని ఆయన అన్నారు. ఏజన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై నిఘా ఉంచామని, దాడులు నిర్వహిస్తూ గంజాయి సాగుని పూర్తిగా నిరోధిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల కేంద్ర, రాష్ట్ర కమిటీలను ప్రకటించారని, అనుకున్నట్లుగా అందరికి పదవులు లభించాయని, అయితే కొంతమందికి నిరుత్సాహం కలిగినప్పటికి వారికి మరో రూపంలో అవకాశాలు వస్తాయన్నారు. ఇప్పటికే మార్కెట్‌ కమిటీలు, గ్రంథాలయ సంస్థల కమిటీలను నియమించడం జరిగిందని, త్వరలోనే దేవాదాయ కమిటీల నియామకం చేపడతామని తెలిపారు. ఇసుక ర్యాంప్‌ల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ  చంద్రబాబు శాండ్‌ పాలసీలో మార్పులు తెస్తున్నారని చెప్పారు. కనివినీ ఎరుగని రీతిలో రాజధాని శంకుస్థాపన ఉంటుందని ఆయన అన్నారు.  అనంతరం గన్ని నివాసంలో శ్రీ  రాజప్ప విందు స్వీకరించి అనంతరం  హైదరాబాద్‌ పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్వశ్రీ  కాశి నవీన్‌కుమార్‌, వర్రే రాజేష్‌, ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, నందిన వెంకటప్రసాద్‌, దోనేపూడి సుమన్‌, కాపు, కొత్తూరి బాల నాగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా గన్ని నివాసంలో శ్రీ రాజప్ప, గన్ని కృష్ణలు కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇటీవల ప్రకటించిన టిడిపి  రాష్ట్ర కమిటీలో శ్రీ  గన్ని కృష్ణకు ప్రాధాన్యం దక్కని నేపధ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే  భేటీ అనంతరం ఈ విషయమై గన్ని కృష్ణను విలేకరులు ప్రశ్నించగా ఇది పూర్తి అంతరంగికమని వ్యాఖ్యానించారు.

gannnn

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.