నటి జమున

jamunaప్రఖ్యాత నటి శ్రీమతి జమున గారు, ఆగస్టు, 30, 1937 న హంపీలో పుట్టారు.తెలుగు మాతృభాషకాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రంలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు యమునను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించారు.. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారీమె. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలొ జమున కనిపిస్తారు.. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసారు.. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. 1989ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీచేసి గెలిచారు. అయితే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పతనం కావడంతో 1991 లో చోటుచేసుకున్న మధ్యంతర ఎన్నికల్లో ఈమె ఓటమి చెందారు. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి. కళాకారుల అభ్యున్నతికి ఆమె ఎంతగానో కృషి చేసారు.

phanibabu భమిడిపాటి ఫణిబాబు , పూనే

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.