నిత్య విద్యార్ధి ఖాతాలో తాజాగా 5వ ఎల్‌ఎల్‌ఎం

24 కి చేరిన డిగ్రీలు – పిహెచ్ డి కోసం కొనసాగుతున్న కసరత్తు

ramareddy
వందల డిగ్రీలు సాధించిన వాళ్ళు ఎందరో వున్నారు. అత్యున్నత చదువులతో ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళూ వున్నారు. కానీ విభిన్న వృత్తులకు సంబంధించిన కోర్సులను అవలీలగా పూర్తిచేస్తూ , పైగా డిస్టింక్షన్ , ఫస్ట్ క్లాస్ లలో పాసవుతూ, అధ్యయనం కోసం నిరంతర విదార్ధిగా కొనసాగుతున్న వాళ్ళు చాలా అరుదు. అందులో అగ్రగణ్యులు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి. ఈయన ఇప్పటికే 23 డిగ్రీలు సాధించి, తాజాగా ఈయన ఖాతాలో మరో డిగ్రీ జమ చేసుకున్నారు. వృత్తిరీత్యా వైద్యునిగా బిజీ గా వుంటూనే, సమాజ హిత కార్యక్రమాలలో, అన్ని రకాల సమావేశాల లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తూ, క్షణం తీరిక లేకుండా ఉంటున్న డాక్టర్ రామారెడ్డి, ఇంజనీరింగ్‌, న్యాయశాస్త్రం, జర్నలిజం, గ్రంధాలయ శాస్త్రం ఇలా పలు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యూయాషన్ కోర్సులు పూర్తిచేస్తూ, 24 డిగ్రీలు సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. డా. రామారెడ్డి న్యాయ విద్యలో నాలుగు ఎల్ ఎల్ ఎం లు పూర్తిచేసి, తాజాగా ఐదవ ఎల్‌ ఎల్‌ ఎం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తన ప్రత్యేకత చాటుకున్నారు. ఏదో తూతూ మంత్రంగా కాకుండా నేటి విద్యార్ధులకు అవసరమైన జిజ్ఞాస, శ్రద్ధ, ఆసక్తి వంటి సుగుణాలన్నీ డా. రామారెడ్డిలో పుష్కలంగా ఉండటం స్ఫూర్తిదాయకం.
మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ డిగ్రీ కోసం సిద్ధం …
టో ర్ట్స్ అండ్ క్రైమ్, సైబర్ లాస్ అండ్ ఇంటలెక్చువల్ రైట్స్, కానిస్టి స్ట్యూ షనల్ అండ్ అడ్మినిస్ట్రెటివ్ లాస్, లేబర్ లాస్ లలో పిజి పూర్తిచేసిన డాక్టర్ రామారెడ్డి ఇప్పుడు ‘కార్పోరేట్ అండ్ సెక్యూరిటీ లాస్’ను 67 శాతం ప్రథమ శ్రేణి మార్కులతో పూర్తి చేశారు. అయితే ఈయన విద్యా తృష్ణ ఇంకా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా త్వరలో పిహెచ్ డి కూడా పూర్తిచేయబోతున్నారు. మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ డిగ్రీ పొందేందుకు సిద్ధపడుతున్నారు. దేశంలోనే ఓ డాక్టర్ ఇన్ని విభిన్నమైన కోర్సులు పూర్తిచేసిన ఘనత సొంతం చేసుకున్న డాక్టర్ రామారెడ్డి రాజమహేంద్రవరానికి , గోదావరి తీరానికే వన్నె తెస్తున్నారు. ఎం బి ఎ , ఎం టెక్ , ఎం సి ఎ , ఎం ఎల్ ఐ సి , ఎం ఎ ఇంగ్లీష్ , మాస్టర్ ఆఫ్ జర్నలిజం ఇలా ఎన్నో డిగ్రీలు సాధిస్తూ వస్తున్న ఈయన రాజాగా 5వ ఎల్ ఎల్ ఎం సాధించిన నేపధ్యంలో శనివారం ఉదయం రాజమహేంద్రవరం ప్రకాశం నగర్‌లోని మానస ఆసుపత్రిలో జి.ఎస్‌. కృష్ణ మెమోరియల్‌ లా కళాశాల డైరక్టర్‌ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మధుసూదనరావు, ఫణి నాగేశ్వరరావు, పి.వి.ఎస్‌.కృష్ణారావు, మానస ఆసుపత్రి మేనేజర్‌ సురేష్‌ తదితరుల తో కల్సి పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ వరవడి కొనసాగిస్తా …

ramareddy1
‘ గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేందుకో, ప్రచారం కోసమో తానీ వయస్సులో చదువుకోవడం లేదు. పైగా విద్యా డిగ్రీల సాధన పరంగా గిన్నీస్‌ బుక్‌లో పేరు నమోదయ్యేందుకు అవకాశం లేనే లేదు. విద్యాభ్యాసం మన జీవితంలో ఓ భాగంగా భావించి, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచేందుకే తానీ వయస్సులోనూ చదువుకుంటున్నా. ఈ ఒరవడి భవిష్యత్‌లోనూ కొనసాగిస్తా. న్యాయ శాస్త్రంపై, న్యాయ విద్యపై గౌరవం, ఆసక్తితోనే తాను న్యాయ శాస్త్రంలో అనేక డిగ్రీలు సాధించా. వైద్యునిగా ఇప్పటికే తాను మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్‌ అయి ఉన్నందున నిబంధనల ప్రకారం బార్‌ కౌన్సిల్‌లో పేరు రిజిష్టర్‌ చేసుకునేందుకు వీలు పడదు. అయితే ఎకడమిక్‌ లాయర్‌గా న్యాయ కళాశాలల్లో విద్యా బోధన చేసేందుకు వీలవుతుంది. చదువుకోవడంలో ఓ ఆనందం, తృప్తి ఉన్నాయి. ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి అవార్డులు వచ్చాయి. మరికొన్ని సంస్థలు కూడా ప్రశంసా పత్రాలను అందించాయి.
డాక్టర్ రామారెడ్డి ‘పద్మ’ పురస్కారం దక్కాలి …
లా కళాశాల డైరక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ కళాశాల ద్వారా డా. రామారెడ్డి ఐదు పి.జి. డిగ్రీలు సాధించడం తమ కళాశాలకు గర్వకారణంగా, వుందని అన్నారు. అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన డా.రామారెడ్డిని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారంతో గౌరవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కళాశాల డైరక్టర్‌ శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మధుసూదనరావులను డా.రామారెడ్డి దుశ్శాలువాలతో సత్కరించి, పుస్తక రత్నాలను జ్ఞాపికగా అందించారు. అలాగే డా. రామారెడ్డిని కూడా పలువురు సత్కరించారు. ఆసుపత్రి సిబ్బంది కూడా అభినందనలతో ముంచెత్తారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.