నిత్య హారతికి శతదినోత్సవం

పుష్కరాల రేవులో ఘనంగా ఏర్పాట్లు
      harati4harati.2harati3

     నదీమ తల్లికి హారతి చూడాలంటే, వారణాసి ప్రసిద్ధి . హరిద్వార్ లో కూడా. గంగా నదికి హారతి సమర్పించడం చూస్తుంటే కన్నుల పండగే . వారణాసిలో దాదాపు 45నిముషాల సేపు హారతి ఇస్తుంటే , జనం రేవు నుంచి కదలరు. అయితే గోదావరికి మాత్రం ఏం తక్కువ. అందుకే ఇక్కడ కూడా హారతి కార్యక్రమం ఆరంభించారు. 2003పుష్కరాలలోనే గోదావరి నిత్య హారతికి సంకల్పం జరిగినా , కార్యరూపం దాల్చింది మాత్రం 2015పుష్కరాలలోనే. గత పుష్కరాల తర్వాత భారత్ వికాస్ పరిషత్ వంటి సంస్థలు పొర్ణమి హారతి సమర్పించేవి. అయితే కాశీలో నిర్వహిస్తున్నట్టుగానే ఇక్కడ కూడా  హారతి ఉత్సవం జరపాలని   సంకల్పించిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ కార్తీక పొర్ణమి నాడు శ్రీకారం చుట్టి,  గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమికి గోదావరి హారతి నిర్వహిస్తూ , కార్తీక పౌర్ణమికి భారీ ఎత్తున హారతి ఉత్సవం నిర్వహిస్తూ వచ్చింది. పలు చానెల్స్ , మీడియా దీనికి విస్తృత ప్రాచుర్యం కల్పించాయి. ఫలితంగా ఏక హారతి మొదలు వివిధ హారతులు సమర్పిస్తూ సాగే గోదావరి ఉత్సవంకి మంచి ప్రాచుర్యం లభించింది. ఈ నేపధ్యంలో గోదావరి పుష్కరాలు గత జూలైలో రావడంతో నిత్య హారతికి సిఎమ్ శ్రీ చంద్రబాబు ఆదేశించారు. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ , బుద్దవరపు చారిటబుల్ ట్రస్ట్ తో కల్సి నిత్య హారతికి రంగం సిద్ధం చేసింది. రెండు బ్రిడ్జిల నడుమ పంటుపై విద్యుత్ కాంతుల మధ్య నిత్య హారతి కార్యక్రమాన్ని గడిచిన జూలై 1వ తేదీన ప్రారంభించి , దిగ్విజయంగా సాగిస్తున్నారు.
ఈసారి పుష్కరాలలో అయితే గోదావరి హారతి ఉత్సవం హైలెట్ గా నిలిచింది. హారతి తిలకించడానికి జనం పోటెత్తారు. పుష్కరాల సమయంలో సిఎమ్ శ్రీ చంద్రబాబు రాజమండ్రిలోనే మకాం వేయడం , ఎపి రాజధాని నిర్మాణానికి ప్లాన్ ఇవ్వడానికి వచ్చిన సింగపూర్ మంత్రి బృందం హారతిని వీక్షించి, తన్మయత్వం చెందింది. అలాగే మంత్రి మండలి సమావేశం కూడా ఇక్కడే జరగడంతో మంత్రులంతా సిఎమ్ తో కల్సి గోదావరి నిత్య హారతి తిలకించారు. ఇక పుష్కరాల చివరి రోజున బాణా సంచా కాల్పుల నడుమ నిత్య హారతి కన్నుల పండువగా సాగింది. బాబా రామ్ దేవ్ గోదావరి నిత్యహారతికి పులకించిపోయారు. పుష్కర సమయంలో ప్రారంభించిన గోదావరి నిత్య హారతికి జాతీయ , అంతర్జాతీయ ప్రచారం లభించింది. దేశ విదేశాల్లో కోట్లాదిమంది వీక్షించారు. ప్రతిరోజూ హారతి కార్యక్రమం కొనసాగిస్తూ , శ్రావణమాసం పవిత్రమైన రోజుల్లో అలాగే వినాయక చవితి కి భారీ ఎత్తున హారతి ఉత్సవం సాగించారు. నిత్య హరతికి జనం భారీగానే వచ్చి , వీక్షిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న నిత్య హారతి నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో పలుచోట్ల గోదావరి హారతి కార్యక్రమం సాగుతోంది.  నిత్య హారతి ప్రారంభించి వంద రోజులు అయింది. అందుకే గురువారం సాయంత్రం శత దినోత్సవాన్ని పురస్కరిచుకుని నిత్య హారతిని కన్నుల పండువగా నిర్వహించడానికి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ , దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.