నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం

ఫిబ్రవరి 13 – 14లలో కిన్నెర ఆర్ట్‌ ధియేటర్స్‌ సారధ్యంలో

ghantasala

వచ్చే ఫిబ్రవరిలో రాజమండ్రిలో ఓ బృహత్తర కార్యక్రమ నిర్వహణకు హైదరాబాద్ కిన్నెర ఆర్ట్‌ ధియేటర్స్‌ సన్నద్ధమవుతోంది. గతంలో వరుసగా 10ఏళ్ళు ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం నిర్వహించిన ఈ సంస్థ పదేళ్ళ విరామం అనంతరం 24 గంటల నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం కార్యక్రమాన్ని తలపెట్టింది. కేవలం ఎపి లోని కళా కారులే కాకుండా అటు తెలంగాణా కళా కారులు కూడా హాజరయ్యేలా ఈకార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ప్రారంభమయ్యే 24 గంటల నిర్విరామ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం 14వ తేదీ రాత్రి ముగుస్తుంది. ముగింపు ఉత్సవానికి ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా ఘంటసాల పురస్కారం కూడా అందజేస్తారు. ఈ నేపధ్యంలో కిన్నెర సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మద్దాలి రఘురామ్‌ గురువారం ఉదయం రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో సినీ నటుడు, గాయకులు జిత్‌మోహన్‌ మిత్రా , సినీ విజ్ఞాన విశారద శ్రీ ఎస్‌.వి.రామారావు, ఫణి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సుబ్బారావు లతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ రఘురాం మాట్లాడుతూ 1994 లో ఘంటసాల ఆరాధనోత్సవ కార్యక్రమాలను చేపట్టామన్నారు. 1994లో హైదరాబాద్‌లో 12 గంటలపాటు ఆరాధనోత్సవం నిర్వహించామని, 1995లో హైదరాబాద్‌లోనే 24 గంటలు, 1996లో విజయవాడలో 36 గంటలు నిర్వహించామని, 1997, 98, 99ల్లో 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవాన్ని చేసామని వివరించారు. అయితే పదేళ్ళ విరామం అనంతరం తిరిగి ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ముగుంపు ఉత్సవానికి ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు గాయకులు వస్తున్నారని చెప్పారు. అటు తెలంగాణా, ఇటు ఎపి లోని మొత్తం 23జిల్లాల నుంచి ఘంటసాల పాటలు పాడే గాన బృందాలు పాల్గొంటాయని చెప్పారు.
శ్రీ జిత్‌మోహన్‌ మిత్రా మాట్లాడుతూ రాజమండ్రిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పటికీ ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం 24 గంటలపాటు జరగడం ఇదే తొలిసారి అవుతుందని చెప్పారు. కిన్నెర ఆర్ట్‌ ధియేటర్స్‌ చేపట్టే ఈ కార్యక్రమాన్ని కళాభిమానులు విజయవంతం చేయాలన్నారు. శ్రీ ఎస్‌.వి.రామారావు మాట్లాడుతూ కళలకు కాణాచి అయిన రాజమండ్రిలో ఈ కార్యక్రమం తలపెట్టడం అభినందనీయమన్నారు. 24 గంటలపాటు నిరాటంకంగా గానాలాపన జరుగుతుందని , ప్రతి నాలుగు గంటలకొకసారి ఆర్కెస్ట్రా మారుతుందని , మొత్తం నాలుగు ఆర్కెష్ట్రా బృందాలు సహకారం అందిస్తాయని వివరించారు. చెన్నై నుంచి కూడా గాయకుల బృందం వస్తుందన్నారు. ఘంటసాల కీర్తనలను ఆలపించాలనుకునేవారు 98660 57777 నెంబర్‌కు సంప్రదించి మద్దాలి రఘురామ్‌తో మాట్లాడాలని సూచించారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.