నీరూస్ షోరూం ప్రారంభంలో రెజీనా సందడి

neerus

ప్రముఖ సినీ నటి రెజీనా కాసేండ్ర ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలో హల్ చల్ చేసింది. డీలక్స్ సెంటర్ దగ్గర ఏర్పాచేసిన నీరూస్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి, షోరూమ్‌లోని పలు కౌంటర్ల వద్ద ఉంచిన ప్రత్యేక డిజైనర్‌ చీరలను తిలకించింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ హరీష్‌కుమార్, డైరెక్టర్లు నీరూస్‌ కుమార్, అవినాష్‌కుమార్, సింగర్‌ మధు, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.రాజ్‌కిషోర్, కాంట్రాక్టర్‌ తోట సుబ్బారావు, వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెజీనా విలేకర్లతో మాట్లాడుతూ, నగరంలో ఇది నీరూస్‌ మొదటి షోరూమ్‌ అని, దీనిని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారని పేర్కొంది. మహిళలు, చిన్నారులకు కావలసిన అన్ని రకాల డిజైనర్‌ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడు నూతన షోరూమ్‌లు ఏర్పాటు కానున్నాయని కూడా చెప్పింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు రెజీనా చెప్పింది. ఇక రాజమహేంద్రవరం అంటే తనకు ఎంతో ఇష్టమని బయట వేదికవద్ద చెప్పుకొచ్చింది. ఇంతమంది జనం స్వాగతించడం ఆనందంగా ఉందని చెప్పింది. కారు దిగి, వేదిక ఎక్కిన వెంటనే హాయ్ రాజమండ్రి అంటూ విష్ చేసింది.

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=neerus%20showroom

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=bv%20raghavarao

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.