నెహ్రూ ఖ్యాతిని తగ్గించే వ్యాఖ్యలు తగవు

టౌన్ హాలులో పండిట్ జయంతి వేడుకలో ఉండవల్లి

nehroo
“భారత దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక భూమిక వహించారు పండిట్ నెహ్రూ. స్వాతంత్య్రం సిద్ధించాక దేశ పగ్గాలు చేపట్టి తొలి ప్రధానిగా భారత దేశాన్ని ఆర్ధికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, సాంకేతికంగా , అన్ని రంగాల్లో భారత్ ని అభివృద్ధి పర్చిన దార్శనికుడు జవహర్‌లాల్‌ నెహ్రూ. అటువంటి వ్యక్తిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రను విస్మరించినట్టే. పంచ వర్ష ప్రణాళిక ద్వారా దేశాన్ని పురోగతి దిశగా నడిపించిన నెహ్రూ చూపిన బాటే పునాది. దేశ స్వయం సమృద్ధికి మార్గం చూపిన నెహ్రూ ని తగ్గించే ప్రయత్నం చేయడమంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే అవుతుంది”అని మాజీ పార్లమెంట్‌ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల పండిట్ నెహ్రూ పై చేస్తున్న విమర్శల వ్యాఖ్యల నేపధ్యంలో స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన భూమిక వహించి స్వాతంత్య్రం సిద్ధించాక నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన నెహ్రూని స్మరించుకోవడం జాతి కర్తవ్యంగా భావించాలన్న ఉద్దేశ్యంతో నెహ్రూ 125వ జయంతి సందర్భంగా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షులు శ్రీ అశోక్‌కుమార్‌ జైన్‌ అధ్యక్షతన టౌన్‌హాలులో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.
     తొలుత టౌన్ హాలు రోడ్ లోని గాంధి – నెహ్రూ ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టౌన్ హాలులో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎం.పి. శ్రీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ శ్రీ ఆకుల వీర్రాజు, చాంబర్‌ అధ్యక్షులు శ్రీ బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ శ్రీ అల్లు బాబి, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ శ్రీ తొక్కుల రామాంజనేయులు, సీనియర్‌ నాయకులు శ్రీ పొడిపిరెడ్డి అచ్యుత్‌దేశాయ్‌, టౌన్‌ హాలు కమిటీ అధ్యక్షుడు శ్రీ జగన్నాధం వెంకటరెడ్డి, గౌతమీ సూపర్‌ బజార్‌ చైర్మన్‌ శ్రీ ప్రసాదుల హరనాధ్‌, చాంబర్‌ గౌరవ కార్యదర్శి శ్రీ కాలెపు రామచంద్రరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు శ్రీ ఎన్‌.వి.శ్రీనివాస్‌ తదితరులు హాజరయ్యారు. సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి ఎస్సెస్స్ కృష్ణ కుమార్ , సర్వశ్రీ దాసి వెంకట్రావు, గ్రంధి రామచంద్రరావు, గుదే  రఘనరేష్‌, కుంపట్ల అమరనాధ్‌, పసుపులేటి కృష్ణ, చిక్కాల బాబులు, పోలాకి పరమేష్‌, భాస్కరరావు , చాంబర్‌ డైరక్టర్లు వలవల చిన్ని, కనకాల రాజా, కొత్త బాలమురళికృష్ణ, తోట లక్ష్మీనారాయణ, కుడుపూడి వెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.

భారత్ పురోభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు నెహ్రూ
ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ నెహ్రూ – గాంధి , నెహ్రూ – సర్దార్ వల్లభాయ్ మధ్య గల బంధాన్ని విశ్లేషించారు. దేశ ప్రజలు భగవంతునిలా కొలిచిన మహత్మాగాంధీ స్వయంగా నెహ్రూని దేశ ప్రధానిగా నిలబెట్టారని, ప్రజలు కూడా నెహ్రూ పాలనను మెచ్చారని పేర్కొన్నారు. పటేల్ గొప్పతనాన్ని అందరూ అంగీకరిస్తారని, అయితే పటేల్ ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నంలో నెహ్రూ ప్రతిష్టను మసక బార్చే ప్రయత్నం మంచిది కాదన్నారు. బాక్రా నంగల్ , నాగార్జున సాగర్ , ఫర్కా , శ్రీశైలం వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అలాగే భిలాయ్ , బొకారో ఉక్కు కర్మాగారాలు , షిప్పింగ్ , ఏరోనాటికల్స్ , అణు రంగాలలో నెహ్రూ చేసిన కృషి మరువలేమని ఆయన కీర్తించారు. అలీన విధానం ద్వారా ప్రపంచానికి నెహ్రూ మార్గ దర్శకులయ్యారని చెప్పారు. కుటుంబమంటే దేశంగా భావించేవారని, మనస్సులో ఎంత విషాదం ఉన్నా మోముపై చిరునవ్వు ఉండేదన్నారు. 1957లో అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైనపుడు, దేశాన్ని నడిపించే నాయకునిగా ఎదుగుతారని కితాబిచ్చిన నెహ్రూ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని ఆయన చెబుతూ , అటువంటి నెహ్రూ ఖ్యాతిని తగ్గించేందుకు కుట్రలు జరుగు తుండడం దురదృష్ట కరమన్నారు. అటువంటి చర్యలను తిప్పి కొట్టాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా దేశాన్ని పాలించిన మహోన్నత వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు. కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ దార్శనికుడైన నెహ్రూని చులకన చేసి మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. ఆధునిక భారత్‌దేశానికి పునాది వేసిన మహోన్నత వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల స్మృతి పథం నుంచి నెహ్రూని తొలగించలేరని అన్నారు. అశోక్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ వివిధ రంగాల్లో దేశాభివృద్ధికి పునాది వేసి పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రపంచానికి నెహ్రూ మార్గదర్శకులయ్యారని నివాళులర్పించారు. ఓట్ల కోసం డబ్బు పంచే విధానాన్ని అనుసరించలేదని, ప్రతి పైస జాతి అభివృద్ధికి వెచ్చించారని అన్నారు. రాజమండ్రిలో టౌన్‌హాలు కేంద్రంగా మరో సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి డిక్లరేషన్‌ పంపాలని నిర్ణయించారు. శ్రీ అచ్యుత దేశాయ్‌,శ్రీ తొక్కుల రామాంజనేయులు మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన నెహ్రూ సభా విశేషాలను వివరించారు. అల్లు బాబి మాట్లాడుతూ మహనీయుల చరిత్రను వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. అసత్యాలను సృష్టించి సమాజంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.