పంచ కావ్యాలపై పంచ దివస్ ప్రవచనం … Kalagautami Speech five Divas

 ‘కళాగౌతమి’ ఆధ్వర్యాన 22నుంచి 26వరకు
పంచ కావ్యాలపై  పంచ దివస్ ప్రవచనం
‘కళాగౌతమి’ ఆధ్వర్యాన రాజమహేంద్రవరం గోదావరి గట్టు లాంచీల రేవు దగ్గర సదనం సంస్కృత కళాశాలలో జూన్ 22నుంచి 26వ తేదీ వరకు పంచ కావ్యాలపై  పంచ దివస్ ప్రవచనం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 10.30గంటలకు  ‘కళాగౌతమి’ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి అధ్యక్షతన ప్రవచానాలు వుంటాయి. 22న డాక్టర్ సిహెచ్ కూర్మయ్య  (ప్రభుత్వ కళాశాల- రాజమహేంద్రవరం) ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఆముక్త మాల్యద గురించి పద్యకవి డాక్టర్ ఓలేటి బంగారేశ్వర శర్మ (తొండంగి) ప్రసంగిస్తారు. 23న పద్యకవి తిలక డాక్టర్ ఎస్వీ రాఘవేంద్ర రావు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. మనుచరిత్ర గురించి  అవధాన అష్టాపద చి. తాతా సందీప్ శర్మ ప్రసంగిస్తారు.
   24వ తేదీన డాక్టర్ పాలంకి శోభారాణి(లెక్చరర్ – తణుకు) ముఖ్య అతిధిగా పాల్గొంటారు. పారిజాతాపహరణం గురించి శ్రీమతి యర్రమిల్లి శారద (పిఆర్ కాలేజి – కాకినాడ) ప్రసంగిస్తారు. 25వ తేదీన డాక్టర్ ఎస్వీ మహాలక్ష్మి (సదనం పూర్వపు ప్రిన్సిపాల్) ముఖ్య అతిధిగా పాల్గొంటారు. శృంగార నైషధం గురించి డాక్టర్ ప్రభల శ్రీవల్లి (ప్రభుత్వ కళాశాల- రాజమహేంద్రవరం) ప్రసంగిస్తారు. 26వ తేదీన శతావధాని డాక్టర్ అబ్బి రెడ్డి పేరయ్య నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. మనుచరిత్ర గురించి  శతావధాని శ్రీమతి  ఆకెళ్ళ భాలభాను(అమలాపురం) ప్రసంగిస్తారు. ఈకార్యక్రమాలను జయప్రదం చేయాలని కళా గౌతమి కార్యదర్శి శ్రీ ఫణి నాగేశ్వరరావు , సహకార్యదర్శి శ్రీ వరహగిరి కృష్ణ మోహన్ కోరారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.