పద్య సారస్వత సమితి ఆవిర్భావం

విరించి వానప్రస్థాశ్రమంలో సభ
మనదైన తెలుగు పద్యాన్ని పరిరక్షించుకోవడం, భాషాభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల (ఆంద్ర – తెలంగాణా) పరిధిగా రాజమండ్రి వేదికగా నూతనంగా ‘పద్య సారస్వత సమితి’ ఏర్పాటైంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కార్యవర్గం కూడా రూపుదిద్దికున్న సంస్థ ఆవిర్భావ సభ అక్టోబర్ 30వ తేదీ శనివారం  ఉదయం  రాజమండ్రి శ్రీరామ నగర్ శ్రీ విరించి వానప్రస్థాశ్రమంలో నిర్వహించారు. పద్య సారస్వత సమితి అధ్యక్షులు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఉదయం  11.58గంటలకు సంస్థ శీర్షిక ను ఆచార్య శలాక రఘునాధ శర్మ ఆవిష్కరించగా , సంస్థ చిహ్నాన్ని నగర మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి ఆవిష్కరించారు. ప్రతిజ్ఞను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి చేయించారు. .గాయకులూ , హెడ్ కానిస్టేబుల్ శ్రీ సత్యనారాయణ లలిత సంగీత లహరితో కార్యక్రమం శుభారంభమైంది
గ్రామీణ వ్యవస్థ నుంచి తెలుగు భాషను , పద్య ప్రాధాన్యం నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు కల్సి , పద్య సారస్వత సమితి ఏర్పాటు చేసినట్లు శ్రీ చదలవాడ చెప్పారు. ఈ కార్యక్రమానికి కర్త క్రియ , కర్మ అన్నీ పద్య సారస్వత సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ సిబివి ఆర్ కె శర్మ అని ఆయన తెల్పారు. సభ ఎక్కడ పెట్టాలని భావించినపుడు తెలుగు పద్యం పుట్టిన రాజమహేంద్రవరం లోనే పెట్టడం సముచితమని ఇక్కడే ఆవిర్భావ సభ ఏర్పాటు చేసినట్లు తెల్పారు . నన్నయకు ముందు పద్యం ఉన్నప్పటికీ ఒక మార్గం లో పద్యాన్ని కూర్చింది మాత్రం నన్నయ అని ఆయన అన్నారు. మేయర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదన్నాన్ని నిలబెట్టుకోవాలసిన అవసరం అందరిమీద ఉందన్నారు. మమ్మీ , డాడీ కాకుండా అమ్మా , నాన్న అని పిలిపించుకోవాలని ఆమె సూచించారు. తెలుగు భాష , సంస్కృతీ కోసం కృషి చేస్తున్న సిఎమ్ శ్రీ చంద్రబాబు రాజమండ్రి పేరును రాజమహేంద్ర వరం గా కూడా మార్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు పద్యం చదివి వినిపించి , ఆహ్లాద పరిచారు. సర్వశ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు, ఓలేటి బంగారేశ్వర శర్మ , దూపాటి వెంకట సీతారామాచార్య, ఉన్నం జ్యోతి వాసు, తాతా సందీప్ , అయ్యగారి వెంకట్రామయ్య , కడప రామముని రెడ్డి , ఆదిత్య విద్యా సంస్థల సంచాలకులు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి, సంస్థ నిర్వహించనున్న ‘పద్య భారతి’ మాసపత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు పద్యాలు ఆలపించి , ఆకట్టుకున్నారు. అతిధులకు, కార్యవర్గానికి సత్కారాలు నిర్వహించారు.
ఆదిత్య విద్యా సంస్థల సంచాలకుడు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి, సర్వశ్రీ పెరుమాళ్ళ రఘునాధ్, దినవహి వెంకట హనుమంతరావు, ఖండవిల్లి అప్పల రామూర్తి , సప్పా దుర్గాప్రసాద్ , చింతల గోపాలరావు, శ్రీపాద జిత్ మోహన్ మిత్రా , కానూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.