పాపం! స్పీకర్ గారు !!

నేటి చట్ట సభల సమావేశాలు
ధర్మ క్షేత్రాలు  గాని కురుక్షేత్రాలు 
లోపల  పోడియం దగ్గర రచ్చ
బయట మీడియా (పాయింట్) దగ్గర చర్చ
ఎన్ని ‘ప్లీజ్ లు ‘ చెప్పినా ప్లీజవ్వరు
పోడియమ్ ను చుట్టిముట్టి పొమ్మన్నా పోరు
ఈ పోరును ఎవరూ ఆపలేరు
అలా అని వాయిదాలు దారిచూపలేవు
పీకలమీద కత్తి పెట్టినట్లు రూలింగ్ ఇమ్మంటారు
రణగొణ ధ్వర్నుల మధ్య వాగిన వాగుళ్ళన్నీ
రికార్డుల నుంచి తొలగించః మంటారు
పాపం ! అధికార , అనధికార పక్షాల మధ్య
అడకత్తెర లో పోక చెక్క స్పీకర్ –
ఇద్దరు కన్నా ఎక్కువ పెళ్ళాల మొగుడైనా
ఇంతకన్నా ఎంచక్కా చెట్ట పట్టాలేసుకు సుఖంగా ఉంటాడేమో !!

జోరా శర్మ 05

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.