పిండిబొమ్మ స్వామికిన్నీ రంగులెందుకూ…!

ganapati

పల్లవి:
పిండిబొమ్మ స్వామికిన్నీ రంగులెందుకూ…!
గుండె నిండా భక్తి చాలు… హంగులెందుకూ…!
పండగల్లో ప్రకృతి వినాశమెందుకూ…!
సందడుల పేరా కాలుష్యమెందుకూ…!
చరణం-1:
మట్టి విగ్రహాల పూజ ముక్తినీయదా…?
పత్రినింత వేయ పరమాత్మ మెచ్చడా…?
భక్తిచేత చిక్కువాడు కాడ దైవము…?
ఎత్తుచేత కాదనేటి సత్యమెరుగుము…!
— జై బోలో గణనాథ్ కీ… జై బోలో ప్రకృతి మాతకీ…
చరణం-2:
పచ్చనాకు తోరణాలు.. కట్ట చాలదా…?
పచ్చనోట్ల కట్టలిన్ని పెట్టనేలరా…?
ఒక్క తులసి దళము చాలు భక్తి మీరగా…!
సంతసించి గణపతయ్య చెంత చేరురా (చింత తీర్చురా…)
— జై బోలో గణనాథ్ కీ… జై బోలో ప్రకృతి మాతకీ…
చరణం-3:
రంగులు, రసాయనాల విగ్రహాలతొ…
చెరువులన్నీ నిండీపోవూ కలుషితాలతో…
జీవులన్నీ నాశమౌను విష జలాలతొ…
తాగునీరు మాయమౌను మాలిన్యాలతొ…!
— జై బోలో గణనాథ్ కీ… జై బోలో ప్రకృతి మాతకీ…
చరణం-4:
మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠ చేయరా…!
లోహాలూ, రసాయనాలూ వాడవద్దురా…!
చిత్తశుద్ధి కలిగి పూజలందజేయగా…
ముక్తినిచ్చు స్వామి ఎంతో మురిసిపోవురా…!
— జై బోలో గణనాథ్ కీ… జై బోలో ప్రకృతి మాతకీ…

Noojilla Srinivas-photo

రచన: నూజిళ్ళ శ్రీనివాస్, ఆంగ్లోపన్యాసకులు,

ప్రభుత్వ (అటానమస్) కళాశాల, రాజమండ్రి.

సెల్: 94408 36041; email: noojillasrinivas@gmail.com

About The Author

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.