పీచు పదార్ధాలతో జీర్ణ క్రియ సమస్యలు దూరం … Fiber foods to check digestive problems

కిఫి హాస్పటల్‌ అధినేత డా. కరుటూరి సుబ్రహ్మణ్యం

????????????????????????????????????

ప్రతి ఒక్కరూ సేవించే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది. ముఖ్యంగా మనిషి ఆరోగ్యం జీర్ణ వ్యవస్ధపై ఆధారపడి ఉంటుంది. కొవ్వు పదార్ధాలు కాకుండా, ఎక్కువగా పీచు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవాలి. తద్వారా జీర్ణ క్రియ సమస్యలు మటుమాయం అవుతాయి’ అని కిఫి హాస్పటల్‌ అధినేత డా. కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రపంచ జీర్ణ వ్యవస్ధ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిప్లా కంపెనీ ఆద్వర్యాన ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన ముఖ్య విషయాలను వివరించారు. గుండె, ఎముకల ఆరోగ్యం, శరీరంలోని మిగిలిన భాగాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వెనుక జీర్ణ వ్యవస్ధ పనితీరు చాలా ముఖ్యమన్నారు. జీర్ణ వ్యవస్ధలో వచ్చే మార్పుల ద్వారా గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ సమస్యల వల్ల గుండె మంట, కడుపు నొప్పి, అతిసారం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు కలుగుతాయని చెప్పారు. తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, కొన్ని సార్లు తినే వస్తువులు ఉదర నాళం అసౌకర్యాలకు దారి తీస్తుందని చెప్పారు. చిరు తిండ్లు, ఘాటైన ఆహారం అధిక కెఫిన్‌, పంచదార సేవనం, తదితర అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఉదర నాళంలో సమస్యలు వస్తాయన్నారు. అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పేగుల గీతలలో మార్పులు కలిగించి ఉదర నాళంలో కణితులు ఏర్పడేందుకు కారణమవుతుందన్నారు. ఎక్కువగా పీచు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకోవాలని, ఐబిడి, హెమరాయ్డ్సి, మలబద్ధం కలిగిన వ్యాధులను నివారించవచ్చని అన్నారు.
జీర్ణ వ్యవస్ధ ప్రక్రియను తగ్గించే అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని పరిమితం చేసుకోవాల ని డాక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. సమయం ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలని, పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యవంతమైన ఉదర నాళానికి ఆరోగ్యవంతమైన ఆహారం అవసరమని, తినే ఆహారంలో పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, వంటకాల్లో ఆలీవ్‌ ఆయిల్‌ను వినియోగించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటా మని ఆయన స్పష్టం చేసారు. తీసుకునే ఆహారంలో సరిపడా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలని, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఒత్తిడి వల్ల కూడా అల్సర్‌ రావడానికి అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నారు. త్రేన్పులు వచ్చినా, అపాన వాయువులు ఎక్కువగా వచ్చినా గ్యాస్ట్రిక్‌ సమస్య ఏర్పడిందని అనుకోవడం కేవలం అపోహ అని తెలిపారు. ప్రపంచంలో గ్యాస్ట్రిక్‌ నివారణకు ఏటా రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారని డాక్టర్ సుబ్రహ్మణ్యం తెల్పారు.

 

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=dr%20karuturi%20subrahmanyamhttps:/

https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=indian%20medical%20association

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.