పుర మందిరానికి పూర్వ వైభవం :ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల

townhal3townhaltownhal2

చారిత్రాత్మక కందుకూరి వీరేశలింగం పుర మందిరాన్ని అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు.గురువారం పురమందిరాన్ని ఆయన సందర్శించి లోపల ఉన్న ప్రార్ధనా మందిరం, ప్రహర్ష పఠన మందిరం, బిల్‌ లాడ్స్‌ రూమ్‌, కళా వేదికను ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల పరిశీలించారు. పుర మందిరం కార్యదర్శి ఆకుల వీర్రాజు, నగర ప్రముఖులు వైఎస్‌ నరసింహరావు, బిజెపి అర్బన్‌ జిల్లా మాజీ అధ్యక్షులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, సన్నిధానం శాస్త్రి, కొప్పిశెట్టి లోవరాజు. హీరాచంద్‌ జైన్‌, వానపల్లి శంకర్‌, రౌతు వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ డాక్టర్ ఆకుల మాట్లాడుతూ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పుర మందిరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు డిజైన్లు రూపొందించాలని ఆదేశించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్ధల నుంచి నిధులు సేకరించి పుర మందిర చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా తీర్చి దిద్దుతామన్నారు. 1897లో కందుకూరి వీరేశలింగం నగరాభివృద్ధికి అవసరమయ్యే సమావేశాలు, సాంస్కృతిక కారక్రమాలు, గ్రంథ పఠనానికి అనువుగా ఈ పుర మందిరాన్ని ఆనాటి పెద్దలతో నిర్మించారని పేర్కొన్నారు. అప్పటి అటవీ శాఖ పారెస్టు ఆఫీసర్‌ నజారుద్దీన్‌ కలప ఏర్పాటులో సహాయ సహకారాలు అందించారని అన్నారు.

http://sarikothasamacharam.com/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B8%E0%B0%BE/

 

Related posts

Leave a Reply

apteka mujchine for man ukonkemerovo woditely driver.